మెట్రో రైలుపై కొత్త వివాదం: రోడెక్కిన విద్యార్థులు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు మార్గం విషయంలో కొత్త వివాదం చోటు చేసుకుంది. మార్పు చేసిన మార్గంలో కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం మెట్రోరైలు కారిడార్‌లో మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రకటన చేసినప్పటి నుంచి ప్రా జెక్టుపై కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. నగరంలో మూడు కారిడార్లలో నిర్మిస్తున్న మెట్రోరైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా కారిడార్ అత్యంత వివాదస్పదమైనదిగా మారిపోయింది.
చారిత్రక కట్టడాల పరిరక్షణ పేర సుల్తాన్‌బజార్ పరిరక్షణకోసం ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ మార్గం వివాదంలో పడింది. కోఠి మహిళా కళాశాల మధ్య నుంచి మెట్రో రూట్‌ను మారుస్తూ వెలువడిన ప్రకటనతో ఆ కళాశాల విద్యార్థులు గురువారం నిరసనలతో రోడ్డెక్కారు. వారికి ఎబివిపి మద్దతు పలికింది. దీంతో మెట్రో అలైన్‌మెంట్ మార్చాలంటూ తరగతులను బహిష్కరించి విద్యార్థులు ర్యాలీగా తరలొచ్చి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి రాస్తా రోకో చేశారు. తమకు మెట్రోరైలు వద్దంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో కోఠి పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రి క్తత వాతావరణం నెలకొంది.

చౌరస్తా నలువైపులా నుంచి బస్సులు, ద్విచక్ర వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ జాం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్, అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్లు జి.శ్రీనివాస్, అంజ య్యలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అక్కడకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్న ఏబీవీపీ నాయకులు, కళాశాల విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారిని వెంటనే విడుదల చేయాలంటూ తోటి విద్యార్థులు డీసీఎంకు అడ్డుపడ్డారు. దీంతో మహిళా పోలీసులు వారిని అడ్డు తొలగించారు.
విషయం తెలుసుకున్న టీడీపీ గ్రేటర్ అధికార ప్రతినిధి ఎం.ఆనంద్‌కుమార్‌గౌడ్ అక్కడకు చేరుకున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. దీంతో పోలీసులు ఆనంద్‌కుమార్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకు ని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో వాహనాల రాకపోకలు సజావుగా జరిగాయి.
కళాశాల మధ్యలో నుంచి మెట్రోరైలు వెళ్లితే ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు శబ్ధ కాలుష్యంతో అనేక ఇబ్బందులకు గురవుతారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ మండిపడ్డారు. ఈ కళాశాల ప్రాంగణంలో ఉన్న బ్రిటిష్ దర్బార్, హిజ్రా హాల్ వంటి చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి రైలు మా ర్గాన్ని కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించకుండానే కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications