గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!!

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు ఏర్పడనుంది. తొలుత హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది. తాజా ప్రతిపాదనల మేరకు అమరావతితో లింకు చేస్తూ మ్యాప్‌లో చేర్చింది. ఈ రైలు కారిడార్ రాజధాని ప్రాంతంలోని పశ్చిమ బైపాస్, ఎన్-6 రోడ్డు గుండా సాగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 90 నిమిషాల్లో, అమరావతి నుంచి చెన్నైకి అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

దక్షిణాదిన రెండు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు ఏపీ రాజధాని అమరావతితో లింకు ఏర్పడనుంది. తొలుత హైదరాబాద్‌-చెన్నై కారిడార్‌లో మాత్రమే అమరావతిని కేంద్రం చేర్చింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు అమరావతిని లింకు చేస్తూ ఆమోదించి మ్యాప్‌లో చేర్చింది. దీని వల్ల అమరావతి నుంచి గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్‌ ఏర్పాటవుతుంది. నాయుడుపేట, తిరుపతి, చిత్తూరు, బంగారపేట, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూరుకు మరొకటి వస్తుంది. దేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్‌-ముంబై మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇందుకోసం నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారానే వివిధ కారిడార్ల డీపీఆర్‌ల రూపకల్పన, మెటీరియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌, కారిడార్‌ నిర్మాణం వంటి పనులు పూర్తి చేస్తోంది. ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం కొత్తగా మరికొన్ని హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను చేర్చింది. తెలంగాణ, ఆంధ్ర తమిళనాడు, కర్ణాటకలకు ఉపయోగపడేలా 2 కారిడార్లను మంజూరుచేసింది.

hyderabad-chennai-high-speed-rail-corridor-is-a-planned-bullet-train-project-around-778-km-long-via

ఏపీ ప్రతిపాదనలు... అమరావతితో అనుసంధానం

కేంద్ర ప్రభుత్వం రూ. 2,245 కోట్లతో అమరావతికి రైల్వే లైన్‌ను మంజూరు చేసింది. తెలంగాణ లోని ఎర్రుపాలెం నుండి గుంటూరు జిల్లాలోని నంబూరు వరకు సుమారు 57 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై సుమారు 3 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ రైల్వే వంతెన నిర్మించనున్నారు. ఇది అమరావతి ప్రాంతంలోనే అతిపెద్ద రైల్వే వంతెన గా, పర్యాటక ఆకర్షణగా నిలవనుంది. కాగా, కేంద్రం మంజూరు చేసిన కారిడార్ లో ఒకటి హైదరాబాద్‌-శంషాబాద్‌-నల్గొండ-సూర్యా పేట-కోదాడ-నందిగామ-అమరావతి/ విజయవాడ-గుంటూరు- చీరాల-ఒంగోలు -నెల్లూరు- నాయుడుపేట-శ్రీసిటీ-చెన్నై. అదే విధంగా మరొకటి మైసూరు- మాండ్య-బెంగళూరు-బంగారుపేట -చిత్తూరు-అరక్కోణం-పూనమల్లె-చెన్నై.
వచ్చే ఏడాది నాటికి వీటి డీపీఆర్‌లు రూపొందించి.. నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం. 2029కి ముందే శంకుస్థాపనలు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+