రెండో రోజు మెట్రో రన్, సిమెంట్ బస్తాలతో మరిన్ని టెస్ట్స్
హైదరాబాద్: మెట్రో రైలు రెండో రోజూ పట్టాలపై పరుగులు తీసింది. ట్రయల్ రన్‌ను శుక్రవారం ఉదయం 11.21 నిమిషాలకు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ (ఉప్పల్) నుంచి నాగోల్ జంక్షన్ వరకు నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌లో మొత్తం 3 ట్రిప్పులు నడిపారు. పట్టాలపై పరుగులు తీస్తున్న మెట్రో రైలును నగరవాసులు ఆసక్తిగా తిలకించారు.
గురు, శుక్రవారాల్లో మెట్రో రైలు పరుగులు తీయడంతో స్థానికులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. గురువారం నాటి టెస్ట్ రన్ గురించి స్థానికులకు తెలియదు. అయితే, ఒక్కసారిగా మెట్రో రైలు పరుగులు తీస్తుండటం చూసిన పలువురు తమ తమ టెర్రాస్, బాల్కనీలలోకి వెళ్లి చూశారు.

మెట్రో రైలు టెస్టులో ప్రతి దానిని చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఎయిర్ కండిషన్, సిగ్నలింగ్, ట్రాక్, అలైన్‌మెంట్ తదితరాలు అన్నింటిని చూస్తామన్నారు. అన్నింటిని పూర్తిగా చెక్ చేస్తామని చెప్పారు. గురువారం టెస్ట్ రన్ తర్వాత మాట్లాడుతూ.. ఇది రొటిన్ టెస్ట్ రన్ అని, ఇలాంటి టెస్టులు మరిన్ని చేస్తామని చెప్పారు.
మెట్రో రైలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే ముందే పలుమార్లు టెస్టు రన్ చేస్తామని చెబుతున్నారు. టెస్టు రన్ పైన తాము పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతనే సేఫ్టీ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ట్రయల్ రన్స్ ఉంటాయని చెబుతున్నారు. మెట్రో రైలులో త్వరలో సిమెంట్ బస్తాలతో లోడ్ వేసి టెస్ట్ రన్ చేయనున్నారు.












Click it and Unblock the Notifications