హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి వద్ద సుజుకీ మేనేజర్ సహా ఫ్యామిలీ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో జరిగిన రో్డ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సుజుకీ మోటార్స్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారును లారీ ఢీకొనడంతో శుక్రవారంనాడు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం మామండూరు వద్ద ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సుజుకీ మోటార్స్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు, కూతురు మరణించారు. ఎపి 22 ఎఎం 0250 కారును లారీ ఢీకొంది. విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందింది. కడప వైపు నుంచి కారు తిరుమల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

లంచం తీసుకుంటూ పట్టబడిన మైనింగ్ అధికారి

Hyderabad Suzuki manager along with family members dead

గుంటూర రామన్నపేటలోని ఖని, భూగర్భ శాళ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వర ప్రసాద్ రూ. 80 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. గుంటూరు చిట్టుగుంటకు చెందిన పాలపర్తి రాము నారాకోడూరులో తనకు ఉన్న 8 ఎకరాల పొలంలో గ్రావెల్ క్వారీ ఏర్పాటు చేసుకోవడానికి భూగర్భ గనుల శాఖాధికారులు, జిల్లా కలెక్టర్, హైదరాబాద్‌లోని మైనింగ్ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని రకాల అనుమతులు మంజూరయ్యాయి.

ఆ పత్రాలను ప్రధాన కార్యాలయం నుంచి గుంటూరులోని మైనింగ్ డీడి కార్యాలయానికి పంపించారు. వాటిని ఇవ్వడానికి నాగేశ్వర ప్రసాద్ లక్ష రూపాయలు డిమాండ్ చేశారని, లేని పక్షంలో అనుమతి పత్రాలను వెనకకు పంపిస్తానని బెదిరించారని రాము తెలిపారు.

అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో 80 వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారని, లంచం ఇవ్వడం ఇష్టం లేక ఎసిబి అధికారులను ఆశ్రయించానని రాము చెప్పారు. రాము ఫిర్యాదు మేరకు ఎసిబి డిఎస్పీలు రాజారావు, విజయ్ పాల్ తమ బృందంతో శుక్రవారం మధ్యాహ్నం వల పన్ని ప్రసాద్‌ను పట్టుకున్నారు.

English summary
Hyderabad Suzuki manager Vishnuvardhan Reddy and his family members dead in a road accident near Tirupathi in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X