గుంటూరులో ముందస్తు హైడ్రా యాక్షన్-దున్నేస్తున్న జేసీబీలు..!
హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు కట్టుకున్న వారిని హైడ్రా బెంబేలెత్తిస్తోంది. దీంతో నగరంలో ప్రతీ చోటా ఆక్రమణలు తొలగించాలంటూ స్థానికంగా డిమాండ్ల పెరుగుతున్నాయి. అంతే కాదు దీని స్ఫూర్తితో ఇప్పడు ఏపీలోనూ హైడ్రా తరహా యాక్షన్ చేపట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడను మంచేసిన బుడమేరు వరదల నేపథ్యంలో హైడ్రా తరహా సంస్థ ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఇదే క్రమంలో రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే గుంటూరు నగరంలో ఆక్రమణపై ఇవాళ అధికారులు కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు. చెరువులు, పార్కులు ఆక్రమించుకుని కట్టుకున్న కట్టడాలపై వీరు కొరడా ఝళిపిస్తున్నారు. జేసీబీలను రంగంలోకి దించి అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. దీంతో కబ్జాదారుల్లో ఆందోళన మొదలైంది. ఇవాళ నగరంలోని గాంధీ పార్క్ సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించారు.

గుంటూరు నగరవ్యాప్తంగా ఉన్న అనధికార కట్టడాలు, హోర్డింగ్‌లను తొలగించాలని గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) నిర్ణయించింది. దీంతో నగరంలో భారీ ఎత్తున పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తన్నారు. గాంధీ పార్క్ ఎదుట నిర్మాణాలతో దీన్ని మొదలుపెట్టారు. అదేవిధంగా నగరంలోని పలు నిర్మాణాలపై దృష్టి పెట్టారు.నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తామని ఇప్పటికే అనేకసార్లు అధికారులు హెచ్చరించారు. అయినా నిర్మాణాలు కొనసాగుతూనే ఉండటంతో వాటిపై నగర కమీషనర్ దృష్టి పెట్టారు.
ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయని పక్షంలో వాటిని కూల్చేందుకు వెనకాడనని కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. మార్జిన్ లో ఉన్న షాపులను, హోర్డింగ్స్ ను వెంటనే తొలగించాలని సూచించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులపై దృష్టి పెట్టామని, అదేవిధంగా వాటిలో ఏమైనా నిర్మాణాలు ఉంటే వెంటనే తొలగిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications