Coal Crisis : కేంద్రం ముందే హెచ్చరించిందా-ఆదుకున్న జల విద్యుత్ : ఏపీలో పరిస్థితి ఇలా..!!
బొగ్గు సంక్షోభం సమయంలో ఏపీలో విద్యుత్ కోతల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజలను పీక్ అవర్స్ లో విద్యుత్ పొదుపు కోసం సూచనలు చేస్తోంది. అదే సమయంలో డిమాండ్ భారీగా పెరగటం ప్రభుత్వం..ట్రాన్స్ కో ను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రస్తుతానికి ఏపీలో జల విద్యుత్ ఆదుకుంటోంది. కేంద్రానికి ఏపీ నుంచి పదే పదే వినతులు వెళ్తున్నాయి. 20 రేక్ ల మేర బొగ్గు సరఫరా చేయాలని కోరుతున్నారు.
Recommended Video

కేంద్రం అప్పుడే హెచ్చరించిందా
అయితే, ఈ పరిస్థితి పైన గత నెలలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. విద్యుత్‌కు తీవ్ర డిమాండ్ ఉంటుందని, అందుకు అనుగుణంగా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు నెలా పదిహేను రోజుల కిందటే హెచ్చరించింది. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను ఏపీ జెన్‌కో తక్షణమే చెల్లించాలంటూ కేంద్ర ఇంధన శాఖ సెప్టెంబరు 2న రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. నిర్దేశిత వ్యవధిలో బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించి, బొగ్గు నిల్వలను పెంచుకోవాలని సూచించింది.

ధర్మల్ నుంచే అధిక ఉత్పత్తితో
విద్యుత్ డిమాండ్‌లో అధిక శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలే తీరుస్తున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు బొగ్గు నిల్వలు పెంచుకోవాలని సూచించింది. ప్రస్తుత అవసరాలను తీర్చేలా బొగ్గు ఉత్పత్తి లేదు. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని సమన్వయం చేయటానికి కేంద్రం కోర్ మేనేజ్‌మెంట్ టీమ్ (సీఎంటీ)ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజూ 20 రైల్వే రేక్‌ల బొగ్గును కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను ఆదేశించాలని తాజాగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్దించింది.

పెరుగుతున్న డిమాండ్...బొగ్గు నిల్వలు మాత్రం
పీపీఏలు, బొగ్గు అనుసంధానం లేకపోవటం నిలిచిపోయిన పిట్ హెడ్ థర్మల్ ప్లాంట్ల (బొగ్గు గనులకు దగ్గరగా ఉన్న ప్లాంట్లు)ను అత్యవసర ప్రాతిపదికన అనుమతులు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక, రాష్ట్రంలో బొగ్గు కొరతతో కడపలోని ఆర్‌టీపీపీలో కొన్ని యూనిట్లను మూసేయాల్సి వచ్చింది. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల సామర్థ్యం కంటే తక్కువ ఉత్పత్తి వస్తోంది. మొత్తంగా 5,010 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జెన్‌కో ప్లాంట్ల నుంచి 2300- 2500 మెగావాట్లు మాత్రమే వస్తోంది. గత నెలలో జెన్‌కో ప్లాంట్లకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు కావాల్సి ఉంటే 24 వేల టన్నులే వచ్చింది.

ఆదుకుంటున్న జల విద్యుత్
ప్రస్తుతం 40 వేల టన్నులకు చేరిందని ఏపీ ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజూ 185.3 మిలియన్ యూనిట్లుగా(ఎంయూ) ఉంది. ఇందులో జెన్ కోకు జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 ఎంయూల విద్యుత్ వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్లను ఉత్పత్తిలో ఉంచారు. వాటి నుంచి రోజూ 15 ఎంయూలు, సీలేరు నుంచి 8 ఎంయూల విద్యుదుత్పత్తి అవుతోంది. నాగార్జున సాగర్, టేల్‌పాండ్, డొంకరాయి, మాచ్‌ఖండ్, తుంగభద్ర డ్యామ్.. ఇతర చిన్నచిన్న జల విద్యుత్ కేంద్రాల నుంచి రోజూ 2 ఎంయూల విద్యుత్ వస్తోంది.

బొగ్గు నిల్వల పెంపు కోసం ప్రయత్నాలు
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకుని అన్ని జల విద్యుత్ ప్రాజెక్టులను ఉత్పత్తిలో ఉంచారు. ఇదే సమయంలో బొగ్గు నిల్వలను పెంచుకోవటంపై జెన్‌కో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విజయవాడలోని వీటీపీఎస్ దగ్గర 21,177 టన్నులు, కడపలోని రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ) దగ్గర 69,813 టన్నులు, కృష్ణపట్నంలో 93,789 ఎంటీల నిల్వలు ఉన్నాయి. సింగరేణి, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి వీటీపీఎస్‌కు 16 సుమారు 60 వేల టన్నులు, ఆర్‌టీపీపీకి 35 వేల టన్నుల బొగ్గు వస్తోంది.

కృష్ణపట్నం ప్లాంటుకు 72 వేల టన్నుల బొగ్గు
కృష్ణపట్నం ప్లాంటుకు 72 వేల టన్నుల బొగ్గు సముద్ర మార్గంలో వస్తోంది. మరో 70 వేల టన్నులను లోడింగ్‌కు ఉంచుతున్నారు. దీంతో కొరతను అధిగిమస్తామని..కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామంటూ మంత్రి బాలినేని చెబుతున్నారు. ఏపీ కోరుతున్న విధంగా 20 రేక్ ల బొగ్గు వచ్చినట్లయితే.. బొగ్గు కొరత తీరి థర్మల్ విద్యుత్ సరఫరా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications