తెలంగాణలో హ్యూందాయ్ రూ.1400 కోట్ల పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రం మరో గొప్ప పెట్టుబడిని రాబట్టుకుంది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కేటీఆర్ తో హ్యూందాయ్ సీఈవో యంగ్చోచి సమావేశమయ్యారు. అనంతరం రూ.1400 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించారు. పెట్టుబడి పెట్టడమే కాకుండా తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో కూడా భాగస్వామిగా ఉండేందుకు హ్యూందాయ్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హ్యూందాయ్ కంపెనీకి ధన్యవాదాలు తెలియజేశారు.
హ్యూందాయ్ కంపెనీకి చెందిన టెస్ట్ ట్రాక్ లతోపాటు ఎకో సిస్టమ్ కు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా కంపెనీ కల్పించబోతోంది. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న అన్ని అవకాశాల గురించి కంపెనీ సీఈవో కేటీఆర్ తో హ్యూందాయ్ ప్రతినిధులు సమగ్రంగా చర్చించారు.

హ్యూందాయ్ పెట్టుబడి తెలంగాణకు గొప్ప బలాన్నిస్తుందని కేటీ ఆర్ అభివర్ణించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తోందన్నారు. కంపెనీకి పూర్తి సహకారం అందిస్తామని, హ్యూందాయ్ వల్ల మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయనే ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications