కిరణ్ మానసికంగా కుంగిపోయారు, ఇక సేవే: లగడపాటి
విజయవాడ: రాష్ట్ర విభజనతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానసికంగా కుంగిపోయారని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. శనివారం విజయవాడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. లగడపాటి రాజగోపాల్‌కు ఈ సందర్భంగా ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మి చాలా మంది సమైక్యాంధ్ర ఉద్యమంలోకి వచ్చారని లగడపాటి తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు కట్టుబడి ఉంటానని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. తాను తిరిగి రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.

తనకు మద్దతు నిలిచిన ప్రజలకు లగడపాటి రాజగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. తాను ఒంటరిగానే విజయవాడకు వచ్చినట్లు తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయాలు తగవని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర అందరి భవిష్యత్ అని తాను నమ్మినట్లు లగడపాటి రాజగోపాల్ తెలిపారు.
రాష్ట్ర విభజనకు విధి సహకరించిందని ఆయన అన్నారు. ప్రజాసేవ చేసేందుకు రాజీకీయాలు అవసరం లేదని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాజకీయాల్లో లేకపోయినా తాను ప్రజాసేవ చేస్తానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. అయితే కొందరు అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. వారికి లగడపాటి సర్దిచెప్పారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications