టిడిపిలో చేరినందుకు గర్వంగా ఉంది: అఖిల, వైసిపి సర్పంచ్‌లు రాలేదు: లోకేష్
వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మంత్రి, టిడిపి నేత అఖిలప్రియ అన్నారు.
నంద్యాల: వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మంత్రి, టిడిపి నేత అఖిలప్రియ అన్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి ఆశీర్వాద యాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని చెప్పారు.
గురువారం నంద్యాల పరిధిలోని రైతు నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. గోస్పాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్, అఖిలప్రియ మాట్లాడారు.

భూమా నాగిరెడ్డి ఆనందపడ్డారు..
రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతం ప్రజలకు మంచి చేయడానికి భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారని, ప్రజలకు మంచి చేస్తున్నానని ఆనంద పడ్డారని, ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటే చెప్పారని, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా ఉంటే తన వద్దకు తీసుకు రావాలని, వెంటనే అమలయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారని అఖిలప్రియ చెప్పారు.

కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి అందుకే
రూ.1500 కోట్లు ఖర్చుపెట్టి నంద్యాలను అభివృద్ధి చేస్తున్నారంటే కేవలం భూమా నాగిరెడ్డి చివరి కోరికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకున్నారని, ఈ అభివృద్ధి కార్యక్రమాలతో తన తండ్రి ఆత్మకు శాంతి కలిగిందని అఖిలప్రియ అన్నారు. తన తండ్రి హామీలన్ని నెరవేర్చుతామని, తనకు అండగా చంద్రబాబు, లోకేష్ అన్న నిలిచారన్నారు.

భరోసా ఇచ్చారు
రాజకీయాల్లో మహిళలు రాణించాలంటే కష్టమైనా మీకు మేం అండగా ఉంటామని భరోసా ఇచ్చారని అఖిలప్రియ చెప్పారు. తనకు ఆళ్లగడ్డ తల్లితో సమానమయితే, నంద్యాల తండ్రితో సమానమని చెప్పారు. పది సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కార్యక్రమాలన్నీ వచ్చేరోజుల్లో తప్పక జరుగుతాయన్నారు. సమస్యలపై ప్రజలు అధికారుల చుట్టూ తిరగకుండా మీ వద్దకే అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చేలా సీఎం చంద్రబాబు ప్రణాళిక చేశారన్నారు. ప్రజల గురించి ఆలోచించే సీఎం రావడం మన అదృష్టమని చెప్పారు.
Recommended Video


ఒక్క వైసిపి సర్పంచ్ రాలేదు
అంతకుముందు నారా లోకేష్ మాట్లాడారు. డబ్బులు ఇచ్చినప్పటికీ మీ ప్రాంతంలో రోడ్లు వేయలేదని ఆయన గోస్పాడులో అన్నారు. బాధ్యతలు, డబ్బులు సర్పంచులకు ఇచ్చామని, వాళ్లు ముందుకు రావాలన్నారు. మూడు సంవత్సరాల్లో సర్పంచులు ఇలా సున్నాలతో అభివృద్ధికి సహకరించకపోయినా, వాళ్ల చెక్ పవర్ రద్దు చేయమని సూచించానన్నారు. తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అని, తాను వచ్చినా ఒక్క వైసిపి సర్పంచ్ కూడా అభివృద్ధి కోసం నిధులు అవసరమని అడిగేందుకు, పనులు చేయమని కోరేందుకు, సమస్యలు చెప్పేందుకు రాలేదన్నారు.












Click it and Unblock the Notifications