ఢిల్లీకి వస్తా: చంద్రబాబు, 'జగన్ కొండమీది కోతిని తెమ్మంటే..!'
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం అవసరమైతే తాను ఢిల్లీకి వస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు.
విజయవాడ: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం అవసరమైతే తాను ఢిల్లీకి వస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు అన్నారు. ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
ఉభయ సభల్లో చట్టబద్దత అంశాన్ని ప్రస్తావించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. చట్టబద్దతపై కేంద్రం జాప్యం చేస్తోందని కొందరు ఎంపీలు ఆరోపించారు. రైల్వే జోన్, డీ లిమిటేషన్, విభజన అంశాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు సూచించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండమీద కోతిని తెమ్మంటే తీసుకొస్తామా? అని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి అన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించామన్నారు.
ఫిబ్రవరి 15లోగా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత తీసుకొస్తామన్నారు. తాము గతంలో చెప్పినవన్నీ చేశామని, ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామా విషయం తమకు అనవసరమని చెప్పారు. రాజ్యాంగానికి లోబడి అన్నింటిని సాధిస్తామని, ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమన్నారు.\












Click it and Unblock the Notifications