వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొందరొద్దు, నా మాటగా చెప్పు, బాబుతో మాట్లాడుతా: దెబ్బకు మెట్టుదిగిన మోడీ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. మధ్యాహ్నం పదకొండు గంటలకు మోడీతో ఆయన భేటీ అయిన విషయం తెలిసిందే.

Recommended Video

Budget allocation to AP, TDP MP dresses like ‘Narad Muni’

ప్రధాని మోడీతో సుజనా చౌదరి భేటీ: బీజేపీపై టీడీపీ ఎంపీల కొత్త ఎత్తుప్రధాని మోడీతో సుజనా చౌదరి భేటీ: బీజేపీపై టీడీపీ ఎంపీల కొత్త ఎత్తు

ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు ఏపీ విషయంలో హామీ ఇచ్చారని తెలుస్తోంది. మోడీతో సుజన ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకు భేటీ అయ్యారు. ఆ తర్వాత భేటీ వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సుజనా సవివరంగా తెలిపారు.

గంటకుపైగా వేచిచూసి 15ని.ల్లోనే: రాజ్‌నాథ్‌తో భేటీపై సుజనా షాకింగ్, అందుకే బాబు నిరసనగంటకుపైగా వేచిచూసి 15ని.ల్లోనే: రాజ్‌నాథ్‌తో భేటీపై సుజనా షాకింగ్, అందుకే బాబు నిరసన

 తొందరపడొద్దు, న్యాయం చేస్తాం

తొందరపడొద్దు, న్యాయం చేస్తాం

ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోను న్యాయం చేస్తామని మోడీ తనతో చెప్పారని సుజన చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. ఏపీకి ఎలాంటి అన్యాయం జరగదని, తొందరపడవద్దని చెప్పారని మోడీ చెప్పారని తెలుస్తోంది.

నా మాటగా చంద్రబాబుకు చెప్పమని

నా మాటగా చంద్రబాబుకు చెప్పమని

ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, ఈ విషయాన్ని తన మాటగా చంద్రబాబు నాయుడుకు చెప్పాలని మోడీ.. సుజనా చౌదరితో చెప్పారని తెలుస్తోంది. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని ఆయనకు ప్రధాని చెప్పారని సమాచారం.

 ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తున్నాం

ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ప్రత్యేక దృష్టితో చూస్తున్నామని మోడీ.. సుజనతో అన్నారు. ఏపీకి అన్యాయం చేయబోమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకుంటామని చెప్పారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను అన్యాయం చేయమని చెప్పారు.

 అవసరమైతే చంద్రబాబుతో మాట్లాడుతా

అవసరమైతే చంద్రబాబుతో మాట్లాడుతా

అవసరమైతే తాను చంద్రబాబుతో మాట్లాడుతానని ప్రధాని మోడీ.. సుజనతో అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బడ్జెట్ 2018-19లో ఏపీకి సరైన కేటాయింపులు రాకపోవడం, ఈ బడ్జెట్‌పై ఏపీ ప్రజల ఆగ్రహాన్ని మోడీకి సుజన వివరించారు.

 మోడీ అపాయింటుమెంట్ కోరిన విజయసాయి రెడ్డి

మోడీ అపాయింటుమెంట్ కోరిన విజయసాయి రెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ కోరారు. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలు, బీజేపీ చెప్పిన అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లేందుకు అపాయింటుమెంట్ అడిగారు.

 చంద్రబాబుకు దెబ్బకు బీజేపీ మెట్టు దిగిందా

చంద్రబాబుకు దెబ్బకు బీజేపీ మెట్టు దిగిందా

చంద్రబాబు దెబ్బకు బీజేపీ మెట్టు దిగిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే ఏపీకి రావాల్సిన అంశాలను కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకుందామని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు బడ్జెట్ అనంతరం పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. అవసరమైతే కొద్ది రోజులు చూసి రాం రాం చెబుతామని కూడా అన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Tuesday assured TDP leader and Union Minister Sujana Choudhary over AP poll promises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X