నాలోనూ లోపాలున్నాయి.. తెలుసుకున్నా.. సరి చేసుకుంటా: లోకేష్
తనలో ఉన్న లోపాలేమిటో తెలిశాయని టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ నిర్వహించిన వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలో పాల్గొన్న లోకేష్ అనంతరం మాట్లాడారు.
అమరావతి: తనలో ఉన్న లోపాలేమిటో తెలిశాయని టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళవారం తెలుగు దేశం పార్టీ నిర్వహించిన వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలో పాల్గొన్న లోకేష్ అనంతరం మాట్లాడారు.
ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయని, అయితే ఆ లోపాలను సవరించుకోగలిగినంత వరకు సవరించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని లోకేష్ వ్యాఖ్యానించారు. తాను కూడా ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నానని అన్నారు.

ఈ వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష ద్వారా తాను తెలుసుకున్న తనలోని లోపాలను సవరించుకునేందుకు మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు శిక్షణ కోసం వెళ్తున్నానని ఆయన తెలిపారు.
ఈ వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష ఇచ్చిన ఫలితాలు బాగుంటే పార్టీలో కీలంగా వ్యవహరించే గ్రామ స్థాయి నేతల వరకు ఈ పరీక్షను నిర్వహించాలని హైకమాండ్ భావిస్తోందని లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications