పురంధేశ్వరి వ్యాఖ్యలు బాధించాయి: టిపై లక్ష్మీ పార్వతి

17న భేటీ: శైలజానాథ్
ఈ నెల 17వ తేదిన సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు భేటీ కానున్నట్లు మంత్రి సాకె శైలజానాథ్ చెప్పారు. ప్రస్తుత పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమన్న కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే లాభమన్నారు.
పొత్తుపై సమాచారం లేదు: రాయపాటి
సమైక్య రాష్ట్రం కోసం ఎంపీ పదవికి ఎప్పుడో రాజీనామా చేశానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వేరుగా చెప్పారు. వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ అందిందని త్వరలో వెళ్లి రాజీనామాను ఆమోదింపజేసుకుంటానన్నారు.
సీమాంధ్ర ఉద్యమంతో కేంద్రం వెనకడుగు వేసిందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తుపై తమకు సమాచారం లేదని చెప్పారు. తాను పార్టీ మారాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో కూడా తెలియదన్నారు.
జగన్ పైన యనమల ధ్వజం
దోచుకున్న సొమ్మును వెదజల్లి వచ్చే ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇప్పటికే రంగం సిద్ధం చేసిందని టిడిపి సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
కుట్రలు, కుతంత్రాలతో మభ్యపెట్టేందుకు పావులు కదుపుతున్న అవినీతిపరుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ పైన సిబిఐ దాఖలు చేసిన పది ఛార్జీషీట్లలో కోర్టు పరిగణలోకి తీసుకున్న ఐదు ఛార్జీషీట్లపై ఇంత వరకు విచారణ ఎందుకు ప్రారంభించేలేదని ప్రశ్నించారు. జగన్ ఎవరినైనా మభ్యపెట్టగల సమర్థుడన్నారు.












Click it and Unblock the Notifications