శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విస్ట్: సివిల్స్ 167 సివిల్స్ ర్యాంకర్ బాలలత శిష్యుడే గోపాలకృష్ణ, ఉద్యోగం చేయను

తెలుగుమీడియం ద్వారా సివల్స్ లో ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సివిల్స్ కోసం ఆయన పదేళ్ళపాటు కష్టపడ్డాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుమీడియం ద్వారా సివల్స్ లో ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సివిల్స్ కోసం ఆయన పదేళ్ళపాటు కష్టపడ్డాడు. చివరకు తన లక్ష్యాన్ని చేరుకొన్నాడు.గోపాకృష్ణ విజయం వెనుక బాలలత ఉన్నారు. ఆమె సివిల్స్ లో 167 ర్యాంక్ సాధించారు.

సివిల్స్ రాయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అవమానాలను, చీత్కారాలను అనుభవించారు. అంతేకాదు వీటన్నింటిని తట్టుకొని తాను కోరుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నారు.

పదేళ్ళపాటు తాను పడిన కష్టానికి పలితం దక్కిందని గోపాలకృష్ణ చెబుతున్నారు.అసాధ్యమనుకొన్న విషయాన్ని సుసాధ్యం చేశారు. బావితరాలకు గోపాలకృష్ణ ఆదర్శంగా నిలిచాడు.గోపాలకృష్ణకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రాని సంస్థలు కూడ ఆయన సివిల్స్ లో టాప్ ర్యాంక్ లో నిలవడంతో ఆశ్చర్యపోతున్నారు.

గోపాలకృష్ణకు శిక్షణ ఇవ్వకుండా తప్పు చేశామనే బావన వారి మదిని తొలుస్తోంది.అయితే గోపాలకృష్ణ మాత్రం తనను హేళనచేసినవారికి తాను ఏమిటో నిరూపించాడు. తెలుగుమీడియం విద్యార్థులు కూడ ప్రతిభలో ఇతరులకు కూడ తీసిపోరనే నిరూపించాడు.

బాలలత శిష్యుడే గోపాలకృష్ణ

బాలలత శిష్యుడే గోపాలకృష్ణ

సివిల్స్ మూడో ర్యాంక్ సాధించిన తెలుగుతేజం గోపాలకృష్ణకు శిక్షణ ఇచ్చింది బాలలత.ఆమెకు సివిల్స్ లో 167వ, ర్యాంకు వచ్చింది. ఐఎఎస్ సాధించడం అనేది మారుమూల ప్రాంతం నుండి వచ్చినవారికి కూడ సాధ్యమేనని విషయాన్ని నిరూపించేందుకు తాను సివిల్స్ రాసినట్టు బాలలత చెబుతున్నారు. మరో వైపు బాలలత శిక్షణలో గోపాలకృష్ణ రాటుదేలాడు.అయితే శిక్షణ ఇచ్చిన బాలలతకు 167 ర్యాంకు వచ్చింది. శిక్షణ తీసుకొన్న గోపాలకృష్ణకు మూడో ర్యాంకు దక్కింది.

ఫేస్ బుక్ లో బాలలత పోస్ట్

ఫేస్ బుక్ లో బాలలత పోస్ట్

గోపాలకృష్ణ నా విద్యార్థి. తనతో కలిసి ఉన్న ఫోటోను ఆమె తన ఫేస్ బుక్ వాల్ లో పోస్ట్ చేశారు. తన విద్యార్థి కల సాకారమైందని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అంతేకాదు గోపాలకృష్ణతో దిగిన ఫోటోను ఆమె ఫేస్ బుక్ లో పోస్టుచేశారు.ఐఎఎస్ కావాలనే కోరిక ఉన్నవారికి తాను శిక్షణ ఇవ్వనున్నట్టు బాలలత చెప్పారు.

ఐఎఎస్ ఉద్యోగం చేపట్టను

ఐఎఎస్ ఉద్యోగం చేపట్టను

సివిల్స్ లో 167 ర్యాంకు సాధించిన బాలలత తాను ఐఎఎస్ ఉద్యోగాన్ని చేపట్టబోనని చెప్పారు. కానీ, తాను ఐఎఎస్ కావాలనే తపన, పట్టుదల ఉన్నవారిని ఐఎఎస్ లుగా అయ్యేలా శిక్షణ ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. తనలాంటివారెందరికో శిక్షణ ఇవ్వడం ద్వారా ఐఎఎస్ లుగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఈ కారణంగానే తాను ఐఎఎస్ ఉద్యోగాన్ని చేపట్టబోనని ఆమె ప్రకటించారు.

తెలుగు అంటే ఇష్టం

తెలుగు అంటే ఇష్టం

తెలుగు అంటే తనకు ఇష్టమన్నారు గోపాలకృష్ణ. సివిల్స్ కు తెలుగులో ప్రిపేర్ అవుతోంటే స్నేహితులు, గురువులు అవమానించారని ఆయన చెప్పారు. సివిల్స్ కు ప్రిపేర్ అయితే తనను నిరుత్సాహపర్చారని చెప్పారు.అయితే తనను తన కుటుంబసభ్యులు ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తమ గ్రామం నుండి తమ కుటుంబాన్ని వెలివెయడంతో తనలో మరింత కసినిపెంచిందన్నారు.

English summary
I like Telugu very much said civil top 3rd ranker Gopalakrishna on Thursday.Balalatha trained him for civils examination. she posted a photo on facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X