వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రకు నేను గవర్నర్‌ను ఐతే: రాయలసీమలో సర్వే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sarve Satyanarayana
అనంతపురం: రాష్ట్రం విడిపోయాక తాను సీమాంధ్ర రాష్ట్రానికి గవర్నర్‌గా వస్తే, ఈ రాష్ట్రానికి పూర్తి న్యాయం చేస్తానని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన అనంతపురం జిల్లా హిందూపురానికి వచ్చారు. ఈ సందర్భంగా తన వియ్యంకుడి ఇంటిలో విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాద్ అందరి సొత్తూ అని, సీమాంధ్రులు కానీ, ఇతరులు కానీ వెళ్లిపోవాలని చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సుప్రీం కాదన్నారు. 2014లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. సీమాంధ్రకు రాజధానిని ఎంపిక చేసుకునే బాధ్యత ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉంటుందన్నారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇప్పటికీ సీమాంధ్ర ప్రాంతంలో తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేని గ్రామాలున్నాయని, దీనికి ఇక్కడి పాలకుల పాపమే కారణమని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కువ రోజులు పరిపాలించింది ఇక్కడి ముఖ్యమంత్రులేనని, అయితే వారు తమ ఆస్తులను పెంపొందించుకోవడం, బంధువులను అభివృద్ధి చేసుకోవడం తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఏమాత్రం ఆలోచించ లేదన్నారు.

కొంతమంది రాజకీయ నాయకులు హైదరాబాద్‌లోని ఆస్తులను కాపాడుకోవడం కోసమే సమైక్యాంధ్ర అంటున్నారన్నారు. 2009కి ముందు తెలంగాణకు సై అన్న వారు నేడు నై అంటున్నారన్నారు. సీమాంధ్ర అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.

English summary
Central Miniter Sarve Satyanarayana on Wednesday 
 
 said he may be appointed Governor for Seemandhra, he 
 
 will do full justice to the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X