వెంకయ్య తలిస్తే: ఉండవల్లి, నేనున్నా లేనట్లే: అశోక్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు అన్నారు. శనివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మోడీకి రాసిన లేఖను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ సీఎంలే వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ పారదర్శకంగా ఉండబోతోందని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్‌ సమస్యను సామరస్యంగా పరష్కిరించుకోవాలని సూచించారు. వైషమ్యాలు పెంచుకోవడంతో లాభంలేదని అశోక్‌గజపతి రాజు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించటంపై ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వం ప్రకటన చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అందరూ ఎంపీలు కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తలచుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోతే తాను పదవిలో ఉన్నా లేనట్లేనని ఆయన అన్నారు.

I was trying to achieve special status to AP:ashok

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా సాధించి మంచిపేరు తెచ్చుకోవాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ ఏపీకి ద్రోహం చేస్తే, తెలుగుదేశం, బీజేపీలు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేశాయని ఉండవల్లి ఆరోపించారు.

తల్లిని, మాతృభాషను మరచిన వాడు మనిషే కాడని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. తెలుగును అవమానించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో తెలుగు బోధన తగ్గించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావటం లేదన్నారు. పరభాషా వ్యామోహంలో పడి తెలుగు మాధుర్యాన్ని మరచిపోతున్నారని ఆయన అన్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేయాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+