పులివెందులలో జగన్‌పై నేనే పోటీ: కాలు దువ్వుతున్న టిడిపి నేత

కడప: కడప జిల్లా పులివెందులలో వైయస్సార్ కాంగ్రసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసేది తానేనంటూ ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు హడావిడి చేస్తున్నారు. వైయస్ కటుంబంపై ఓ కొత్త నాయకుడు కయ్యానికి కాలు దువుతున్నాడు.

వచ్చే ఎన్నికల్లో పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది తానేనంటూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఆయనెవరో కాదు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్‌ పేర్ల పార్థసారధి. వేంపల్లి మండలంలో పర్యటించిన ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తానేనని, పులివెందుల ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించారు.

రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత తమ టిడిపి ప్రభుత్వానిదేనని చెప్పారు. అయితే పేర్ల పార్థసారధి వ్యాఖ్యలపై జిల్లాలో చర్చ సాగుతోంది.. సాధారణంగా ఎవరూ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే తానే అభ్యర్థినని ప్రకటించడమనేది జరగదు. ఎవరు కూడా అలా ప్రకటించుకోరు.

I will contest against YS Jagan in Pulivendula says Parthasarathi

అలా చెప్పుకుంటే పార్టీలోని మిగిలిన నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. అయితే పార్థసారథికి మాత్రం ఇతర టిడిపి నేతల నుంచి వ్యతిరేకత ఎదురు కావడం లేదు.పులివెందుల్లో పోటీ చేసేందుకు టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రారని, కాబట్టి కాసింత ఉత్సాహం ఉంటే చాలు టీడీపీ టికెట్ వచ్చేస్తుందని చెబుతున్నారు.

ఇంతకు ముందు పులివెందుల నుంచి సతీష్ రెడ్డి పోటీ చేసేశారు. కానీ ఆయన ఎప్పుడూ విజయం సాధించలేదు. అనంతరం ఎమ్మెల్సీగా వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు పార్థసారథి ముందుకొచ్చి తాను పోటీ చేస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+