కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు కొత్త తలనొప్పి: ఎవరో వచ్చి ఇక్కడ రాజకీయమా, టిడిపిలో అప్పుడే ఫైట్

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గాల పునర్విభజన చిక్కులు తప్పేలా లేవు. ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు టిడిపిలో చేరుతున్నారు.

నంద్యాలలో రోజాకు మహిళల చుక్కలు, ఇంటికి పంపిస్తారా అని అఖిలపై రోజా ఆగ్రహంనంద్యాలలో రోజాకు మహిళల చుక్కలు, ఇంటికి పంపిస్తారా అని అఖిలపై రోజా ఆగ్రహం

ఆశలు పెట్టుకున్న చంద్రబాబు

ఆశలు పెట్టుకున్న చంద్రబాబు

ఎంతమంది పార్టీలోకి వచ్చినా అందరికీ టిక్కెట్లు ఇవ్వవచ్చునని చంద్రబాబు భావించారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అది ఫలప్రదమయ్యే పరిస్థితి లేదు. దీంతో టిడిపి నుంచి టిక్కెట్లు రాక ఎన్నికల నాటికి పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారని భావిస్తున్నారు.

రెండేళ్ల ముందే కుమ్ములాట

రెండేళ్ల ముందే కుమ్ములాట

మరోవైపు, ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ కోసం టిడిపిలో అప్పుడే కుమ్ములాట ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ తనయుడు టిజి భరత్, స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య తాజాగా కర్నూలు నియోజకవర్గంపై వాగ్యుద్ధం నడిచింది. మేం పోటీ చేస్తామంటే మేమని చెబుతున్నారు.

Recommended Video

Chandrababu Naidu And His son Nara Lokesh Fight Real OR Fake ?
ఎక్కడి వారో ఇక్కడ రాజ్యం, రాజకీయం చేస్తారా?

ఎక్కడి వారో ఇక్కడ రాజ్యం, రాజకీయం చేస్తారా?

2019 ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమని, ఎమ్మెల్యే అవుతానని, కర్నూలులో పుట్టి పెరిగిన తాము కర్నూలును ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని, ఎక్కడెక్కడో వారువచ్చి ఇక్కడ రాజ్యం, రాజకీయం చేస్తామంటే చూస్తూ ఊరుకొనేది లేదని టీజీ భరత్‌ అన్నారు.

మా కుటుంబ రక్తంలోనే కర్నూలు

మా కుటుంబ రక్తంలోనే కర్నూలు

తమ కుటుంబ రక్తంలోనే కర్నూలు ఉందని, దాని అభివృద్ధికి ఎంత వరకైనా వెళ్తామని టిజి భరత్ అన్నారు. టీజీవీ ట్రేడు యూనియన్‌ మాస్‌, టీజీబీ యూత్‌ క్లాస్‌ రెండూ కలిస్తేనే టీజీ భరత్‌ అన్నారు.

అప్పుడే నిర్ణయించుకున్నా

అప్పుడే నిర్ణయించుకున్నా

తమ తండ్రి టీజీ వెంకటేష్‌ రాజ్యసభకు వెళ్లినప్పుడే తాను కర్నూలులో పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నానన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని, అది టీజీ వెంకటేష్‌కు ఉందన్నారు. 1999 ఎన్నికల్లో టీజీవీ ట్రేడు యూనియన్‌ ఎంతో కీలకంగా వ్యవహరించిందని, రాబోయే రోజుల్లో టీజీబీ యూత్‌ అద్భుతాలు చేయబోతోందన్నారు.

ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్

ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్

టిజి భరత్ వ్యాఖ్యలపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్పందించారు. తాను వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి ఇదే స్థానంలో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. భరత్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారని, మరి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

English summary
Rajya Sabha Member TG Venkatesh's son TG Bharath said that he will contest from Kurnool in 2019 general elections. MLA SV Mohan Reddy also said I will contest Kurnool from Telugu Desam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X