షాక్: నంద్యాల బరిలో ఉంటా, చెప్పాల్సిదంతా చెప్పేశా, ఇక బాబుదే నిర్ణయమన్న శిల్పా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:టిడిపి నంద్యాల ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి టిడిపికి షాకివ్వనున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాను పోటీచేస్తానని ప్రకటించారు. పోటీకి దూరంగా ఉండి తన కేడర్ ను పోగోట్టుకోలేనని చెప్పారు.తనకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబునాయుడిని కోరినట్టు శిల్పామోహన్ రెడ్డి ప్రకటించారు.నాలుగు రోజుల్లో నిర్ణయం వస్తోందని ఆయన ప్రకటించారు.

కర్నూల్ జిల్లా టిడిపిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అధికార పార్టీలో టిక్కెట్టు కోసం తీవ్ర పోటీ నెలకొంది.

ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూ గుండెపోటుతో గత నెలలో భూమా నాగిరెడ్డి మరణించాడు.అయితే త్వరలోనే నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేసుకొంటున్నారు శిల్ప మోహాన్ రెడ్డి.

భూమా కుటుంబానికి టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.అయితే తానే బరిలో ఉంటానని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నాడు.దీంతో బుదవారం రాత్రి అమరావతిలో శిల్పా సోదరులు చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు.అయితే శిల్పా మోహన్ రె్డి మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీలో ఉంటానని శిల్పా ప్రకటన

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీలో ఉంటానని శిల్పా ప్రకటన

నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి తాను బరిలో ఉంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. అమరావతిలో ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో శిల్పా సోదరులు బుదవారం రాత్రి సమావేశమయ్యారు.అయితే తాను ఉప ఎన్నికల్లో పోటీలో ఉంటానని శిల్పా మోహన్ రెడ్డి బాబుకు తేగేసి చెప్పారు.తాను పోటీలో లేకపోతే తన క్యాడర్ చెదిరిపోయే అవకాశం ఉందన్నారు.అందుకే తాను పోటీచేయకతప్పని పరిస్థితి నెలకొందని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు శిల్పా మోహన్ రెడ్డి.

చెప్పాల్సిందంతా చెప్పా..నాలుగు రోజుల్లో నిర్ణయం

చెప్పాల్సిందంతా చెప్పా..నాలుగు రోజుల్లో నిర్ణయం

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల విషయంలో తాను చెప్పాల్సిందంతా చెప్పేశానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.అయితే నాలుగు రోజుల్లో నిర్ణయం వస్తోందని శిల్పా తేల్చి చెప్పారు.అయితే భూమా శోభానాగిరెడ్డి వర్థంతి రోజున నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసే అభ్యర్థిని భూమా కుటుంబం ప్రకటించనుంది.ఈ మేరకు అదే రోజున తన నిర్ణయాన్ని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది.

తమ్ముడికి మండలి ఛైర్మెన్ ఇచ్చినా సరే తగ్గేది లేదు

తమ్ముడికి మండలి ఛైర్మెన్ ఇచ్చినా సరే తగ్గేది లేదు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన శిల్పా చక్రపాణి రెడ్డికి మండలి ఛైర్మెన్ పదవిని ఆఫర్ చేసింది టిడిపి.అయితే ఈ పదవిని శిల్పా చక్రపాణిరెడ్డికి ఇచ్చినా కాని, తాను పోటీ నుండి విరమించుకొనే ప్రసక్తే లేదని శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబుకు చెప్పారు.దీంతో క్యాడర్ చెదిరిపోకుండా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన చెప్పారు.

క్యాడర్ తో చర్చిస్తా

క్యాడర్ తో చర్చిస్తా

క్యాడర్ ను కోల్పోయేందుకు సిద్దంగా లేనని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతో చర్చించిన విషయాలను నిర్ణయం తీసుకొంటానని చెప్పారు. కార్యకర్తల నిర్ణయాల ప్రకారంగా నిర్ణయం తీసుకొంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.కార్యకర్తల మనోభావాలే తనకు ముఖ్యమని బాబుకు చెప్పారు.

తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని బాబు సూచన

తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని బాబు సూచన

తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు శిల్పా మోహన్ రెడ్డికి సూచించారు. అయితే తన రాజకీయ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని అనివార్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని శిల్పా మోహన్ రెడ్డి బాబుకు చెప్పారు.అయితే ఏ నిర్ణయం తీసుకొన్నా తనకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని శిల్పా బాబును కోరారు.

రాజీ ఫార్మూలా ఇదే

రాజీ ఫార్మూలా ఇదే

బుదవారం నాడు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిలతో శిల్పా సోదరులు సమావేశమయ్యారు.అయితే చంద్రబాబుతో సమావేశానికి ముందే శిల్పా సోదరులు మంత్రులతో చర్చించారు. ఈ దఫా భూమా కుటుంబానికి ఈ స్థానాన్ని కేటాయించాలి. 2019 లో జరిగే ఎన్నికల్లో శిల్పాకే టిక్కెట్టును కేటాయించే పరిస్థితిని కల్పిస్తామని మంత్రులు రాజీ ఫార్మూలాను శిల్పా సోదరుల వద్ద ప్రస్తావించారు.ఈ విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రబాబుతో చర్చించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత బాబుతో రాత్రి పూట శఇల్పా సోదరులు సమావేశమయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will contest in Nandhyal by election said Tdp leader silpa Mohan reddy, wednesday night silpa Mohan Reddy and Silpa Chakrapani Reddy met Andhra pradesh chiefminister Chandrababu Naidu.
Please Wait while comments are loading...