అబ్బే అంతా ఒట్టిదే: టిడిపిలోనే ఉంటా, త్వరలోనే బాబును కలుస్తా: రామసుబ్బారెడ్డి

తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని జమ్మలమడుగు టిడిపి నేత, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి చెప్పారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

జమ్మలమడుగు:తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని జమ్మలమడుగు టిడిపి నేత, మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి చెప్పారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రామసుబ్బారెడ్డి ప్రకటనతో ఊహగాహనాలకు తెరపడింది.

ఆదివారం నాడు తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి వివరించనున్నట్టు చెప్పారు.

I will continue in TDP :Ramasubba Reddy

ఆదినారాయణరెడ్డికి మంత్రి ఇవ్వడంతో పాటు ఆయనను పార్టీలోకి తీసుకోవడం పై పార్టీ అధిష్టానంపై రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయనను పిలిపించి బాబు మాట్లాడారు. అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

విశాఖలో జరుగుతున్న మహానాడుకు కూడ ఆయన వెళ్ళలేదు.ఆదివారం ఉదయం తన అనుచరులతో సమావేశమైన తర్వాత టిడిపిలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు.త్వరలోనే చంద్రబాబును కలుస్తానని చెప్పారు. రామసుబ్బారెడ్డి ప్రకటనతో పార్టీ మారుతారనే వస్తున్న పుకార్లకు తెరపడినట్టైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+