డిగ్గీని కలుస్తానని కిరణ్, నేనూ తగ్గనని కెసిఆర్‌పై బాబు

కలవాల్సిన అవసరం లేదు: శైలజానాథ్
తాము ఇప్పటికే దిగ్విజయ్ సింగ్‌కు అన్ని విషయాలు చెప్పినందున కొత్తగా కలవాల్సిన అవసరం ఏమీ లేదని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. తాను సాయంత్రం జరగనున్న రాయలసీమ ప్రతినిధుల సమావేశానికి కూడా హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.
కెసిఆర్‌పై బాబు
అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన అనంతరం టిడిఎల్పీలో చంద్రబాబు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అంతకుముందు అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మరోసారి మండిపడ్డారు. కెసిఆర్ తన నోటి దురుసు తగ్గించుకోకుంటే తాను తగ్గేది లేదన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా కేంద్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
విభజన విషయంలో తాను కాంగ్రెసు ఎత్తుగడలకు లొంగనని, ఎవరు తీసుకున్న గోతిలో వారు పడక తప్పదన్నారు. ఎన్నికలు నెల ముందు వచ్చినా షెడ్యూల్ ప్రకారం వచ్చినా పెద్ద తేడా ఉండదన్నారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉండొచ్చన్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాకపోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications