వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ ఉంటే నో: శ్రీధర్, టిపై చేతల్లో ఏదని కాంగ్‌పై నిర్మలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్/ఢిల్లీ: కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తాను మంత్రి పదవి చేపట్టనని శ్రీధర్ బాబు ఆదివారం చెప్పారు. తాను తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Sridhar Babu

ప్రజలే ముఖ్యమని నిరూపించారు: శ్రీధర్

శ్రీధర్ బాబు తన మంత్రి పదవికి రాజీనామా చేసి తనకు ప్రజలే ముఖ్యమని నిరూపించారని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి కుట్ర చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు.

చేతల్లో ఏది: నిర్మలా సీతారామన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు పార్టీవి మాటలే తప్ప చేతల్లే ఏమీ చూపించడం లేదని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో అన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టే అంశంపై కాంగ్రెసు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

పార్లమెంటుకు ఎప్పుడు తెలంగాణ బిల్లు వచ్చినా బిజెపి తప్పకుండా మద్దతిస్తుందన్నారు. తిరుమలలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకుండా విఐపిలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. మైనార్టీలపై కేసుల ఉపసంహరణకు కమిటీ వేయాలన్న సుశీల్ కుమార్ షిండే సూచన రాజ్యాంగ విరుద్దమన్నారు. నేరస్థుల పట్ల మతాలకతీతంగా వ్యవహరించాలన్నారు.

English summary
Sridhar Babu on Sunday said he will not in cabinet till Kiran Kumar Reddy is Chief Minister of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X