అందుకే ఎన్నికల్లో పోటీ చేయనని జేసీ
అనంతపురం: అనంతపురం ఎంపీ, టిడిపి నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. అనంతపురంలో పర్యావరణం-పారిశుద్ధ్య శంఖారావం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ మాట్లాడారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో చర్చ సందర్భంగా చేతులెత్తడం తప్ప ప్రజాప్రతినిధులు చేస్తున్నదేమీ లేదని వ్యంగ్యంగా అన్నారు. అందుకే తాను ఇకపై ఏ స్థానానికీ పోటీ చేయనని తెలిపారు.












Click it and Unblock the Notifications