చిరంజీవి 150వ చిత్రంలో నటిస్తున్నా: ఆనం, మోడీపై వ్యంగ్యాస్త్రం
తిరుపతి: టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి 150వ చిత్రంలో తాను కూడా నటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వెల్లడించారు. శనివారం ఉదయం ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చిరంజీవి 150వ సినిమా కోసం ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. సామాజిక న్యాయం, మీడియాపై నిషేధం లాంటి అంశాలన్నీ ఆ చిత్రంలో వుంటాయన్నారు.

వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే వరకు కొనడం తెలుగుదేశం పార్టీకి అలవాటేనని, ఎమ్మెల్యే నుంచి ఎంపి వరకు అమ్ముడుపోవడం వైయస్సార్ కాంగ్రెస్ నాయకులకు పరిపాటని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంవత్సరం ఎవరూ మరిచిపోలేని మూడు పథకాలను దేశ ప్రజలకు అందించారని వ్యంగ్యాస్త్రం విసిరారు.
అన్నిచోట్లా మీకు మీరు శుభ్రం చేసుకోండని స్వచ్ఛ భారత్, ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోకుండా మీ ఆరోగ్యాన్ని మీరే రక్షించుకోండంటూ యోగా, నగరాలను ప్రజలే అభివృద్ధి చేసుకోవాలని, పన్నులు మాత్రం ప్రభుత్వానికి చెల్లించాలని ‘అమృత్' పథకాన్ని ప్రజలకు కానుకగా ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications