అవమానించారు: వైసీపీకి రాపాక వరప్రసాద్ గుడ్‌బై!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. తాజాగా, ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇక తాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడినా.. తనను వైసీపీ అవమానించిందని వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో కష్టపడి పనిచేసినా తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారన్నారు. ఇష్టం లేకపోయినా పెద్దల సూచన మేరకు ఎంపీగా పోటీ చేశానని వరప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను వైసీపీతో తెగదెంపులు చేసుకున్నట్లు చెప్పారు.

తాను త్వరలోనే మరో పార్టీలో చేరతానని రాపాక వరప్రసాద్ ప్రకటించారు. ఏ పార్టీలో చేరే విషయం మాత్రం చెప్పలేదు. అయితే, ఆయన తిరిగి జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ, నియోజకవర్గంలోని జనసేన నేతలు, కార్యకర్తలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది.
2019లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరపున రాజోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొంతకాలం తర్వాత జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు వరప్రసాద్. జనసేన పార్టీ బలపడేది కాదు.. ఏదో గాలివాటంలా తాను ఒక్కడినే గెలిచా అని అప్పట్లో రాపాక వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన.. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఎమ్మెల్యేలను గెలిపించుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశంలో రాపాక వరప్రసాద్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ వేదిక పైన రాపాక కనిపించటంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. గెలిచిన పార్టీని కాదని వెళ్లి..పవన్ పైన విమర్శలు చేసిన రాపాక తిరిగి పార్టీ సమావేశానికి ఎలా వస్తారని నిలదీశారు.
రాపాక తిరిగి జనసేనలో చేరేందుకు ముఖ్య నేతలతో ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారంపైనా వారు మండిపడుతున్నారు. రాజోలు జనసేనలో రాపాకకు తిరిగి ఎంట్రీ ఇచ్చేది లేదని నినదించారు. అయితే, ఈ అంశం పైన స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పందించారు. మలికిపురంలో కాలేజీ లెక్చరర్ల అంశమే రాపాక మాట్లాడారని..ఎలాంటి రాజకీయ అంశాలు రాలేదని ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ స్పష్టం చేశారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications