అందుకే ఏపీ, బాబుకు మద్దతుగానే: ‘అనంత’ అభిమానంపై వాణీ విశ్వనాథ్

Subscribe to Oneindia Telugu

అనంతపురం: ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్లు ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ మరోసారి ఆ విషయంపై స్పష్టనిచ్చారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాను టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

రోజా నాకు పోటీనా?: తేల్చేసిన వాణీ విశ్వనాథ్, రేపే బాబు సమక్షంలో టీడీపీలోకి?

అనంత ప్రజలను మర్చిపోలేను..

అనంత ప్రజలను మర్చిపోలేను..

ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో వాణీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం ప్రజలు చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు.

చంద్రబాబుకే మద్దతు..

చంద్రబాబుకే మద్దతు..

తాను త్వరలో టీడీపీ చేరుతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలో ఏ పాత్ర పోషించాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది టీడీపీ అధినేతచంద్రబాబే నిర్ణయిస్తారని చెప్పారు.
రాజకీయాల్లోకి రావాలని తనకెప్పటి నుంచో ఉందని తన మనసులోని మాటను వెల్లడించారు.

అభిమానంతోనే ఏపీకి..

అభిమానంతోనే ఏపీకి..

తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతోనే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. ఒక వేళ తాను రాజకీయాల్లోకి రాకపోయినా చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని వాణీ విశ్వనాథ్ తెలిపారు.

రోజాకు పోటీగానే..

రోజాకు పోటీగానే..

కాగా, ఇంతకుముందు నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజాపై పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న రోజాకు పోటీగానే వాణీ విశ్వనాథ్‌ను టీడీపీలో చేర్చుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cine Actress Vani Viswanath on Sunday said that she would like to join TDP, for supporting CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి