అదంతా తప్పుడు ప్రచారం, ఎమ్మిగనూరు నుండే పోటీ: జయనాగేశ్వర్‌రెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ప్రకటించారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జయనాగేశ్వర్ రెడ్డి చెప్పారు.

ఎమ్మిగనూరు తన కన్నతల్లిలాంటిందని చెప్పారు. ఎమ్మిగనూరు నుండే పోటీ చేస్తానని చెప్పారు. తనకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ రాదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జయనాగేశ్వర్ రెడ్డి చెప్పారు.

Iam contest from Yemmiganur assembly segment, says Jayangeshwar reddy

చంద్రబాబునాయుడు ఆశీస్సులు తనకే ఉన్నాయన్నారు. 2019 లో కూడ తానే ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. పలువురు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సమావేశంలో జయనాగేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

2019లో తాను ఎమ్మిగనూరు నుండి పోటీ చేసే విషయమై ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావులేదని జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మకూడదని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will contest from Yemmiganur assembly segment in 2019 said MLA Jaya Nageshwar Reddy.wrong publicity on me he said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి