పార్టీని కన్నతల్లిగా భావించి సేవ చేస్తా :దేవినేని నెహ్రు
విజయవాడ: పార్టీని కన్నతల్లిగా భావించి సేవచేస్తానని మాజీ మంత్రి టిడిపి నాయకుడు దేవినేని నెహ్రు చెప్పారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన విజయవాడలో జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి తన అనుచరులతో పాటు ఆయన హాజరయ్యారు. ఎన్ టి ఆర్ మరణం తర్వాత కొంతకాలం పాటు లక్ష్మీపార్వతి వర్గంలో కొనసాగి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనివీడి టిడిపిలో చేరారు.టిడిపిలో చేరిన తర్వాత తొలి సారిగా విజయవాడలో జరిగిన ఆత్మీయసమావేశానికి తన అనుచరులతో హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన హమీ ఇచ్చారు.
పార్టీ తనకు ఏమిచ్చిందనే దాని కంటే పార్టీకి నేనేం చేశాననేదే ముఖ్యమన్నారు దేవినేని. కన్నతల్లి మాదిరిగా పార్టీ కి సేవ చేస్తానని ఆయన చెప్పారు.ప్రస్తుతం నగరంలో ఉన్న పార్టీ ఎంఏల్ఏలతో పాటు ఇతర స్థానాలను కైవసం చేసుకొంటామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications