వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు కట్టుబడి ఉన్నా: అఖిల సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి ఓటమిపాలైతే గతంలో తాను ప్రకటించినట్టుగా రాజీనామాకు కట్టుబడి ఉంటానని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు.

నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. భారీగా ఓటింగ్ నమోదైంది. దీంతో అధికార టిడిపి, విపక్ష వైసీపీ పార్టీల నేతలు తమకే కలిసిరానుందని అంచనావేస్తున్నారు.

క్షేత్రస్థాయి పోలిసులు కొందరు పక్షపాతంగా వ్యవహరించారని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన కేంద్ర బలగాలు, , అధికారులకు శిల్పా ధన్యవాదాలు తెలిపారు.

నంద్యాలలో భారీగా మోహరించిన కేంద్ర బలగాల కారణంగానే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.వైసీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని వైసీపీ అభిప్రాయంతో ఉన్నారు.

రాజీనామాకు కట్టుబడి ఉన్నా

రాజీనామాకు కట్టుబడి ఉన్నా

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందు తాను ప్రకటించినట్టుగానే ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఓటమి పాలైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు. పోలింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఇద్దరు చనిపోతే వచ్చిన పదవి. పదవి, ఆస్తులు తనకు అవసరం లేదన్నారు. అదీ కూడ తల్లి, దండ్రులను కోల్పోయి.... ఈ పదవి దక్కింది. భూమా కుటుంబం ఇచ్చిన మాటను నిలబెట్టుకొంటుందన్నారు. అన్నట్టుగా టిడిపి అభ్యర్థి ఓటమిపాలైతే రాజీనామాకు సిద్దమేనని ఆమె ప్రకటించారు.

టిడిపి గెలిస్తే ప్రతి ఒక్కరికీ క్రెడట్

టిడిపి గెలిస్తే ప్రతి ఒక్కరికీ క్రెడట్

నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి గెలిస్తే ఆ క్రెడిట్ ప్రతి ఒక్కరికి దక్కుతోందన్నారు అఖిలప్రియ.భూమా ఆశయాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతోందన్నారు భూమా అఖిలప్రియ. టిడిపిలో ఎవరైనా చనిపోతే ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని ఈ ఎన్నిక నిరూపించిందని అఖిలప్రియ చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

 టిడిపి అరాచకాలకు పాల్పడింది

టిడిపి అరాచకాలకు పాల్పడింది

ఉపఎన్నికలను పురస్కరించుకొని టిడిపి అరాచకాలకు పాల్పడిందని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించారు. తన సోదరుడు చక్రపాణిరెడ్డిని బలవంతంగా ఇంటి నుండి పంపారని చెప్పారు. చక్రపాణిరెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత కూడ పోలీసులు ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. తమ పార్టీ కౌన్సిలర్లు,. తన మద్దతుదారులపై టిడిపి నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.బ్రహ్మనందరెడ్డి, మౌనిక , ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి నేతలు తమ నేతలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి తమ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ను బెదిరించారని, దాడి చేశారని ఆరోపించారు. మలేరియా జ్వరం వచ్చినా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు చెప్పారు.

కురుక్షేత్ర యుద్దం సాగింది

కురుక్షేత్ర యుద్దం సాగింది

అనేక ఇబ్బందులు పెట్టినా తమ వెంట నడిచినా ప్రతి ఒక్కరికి వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. ఆట మొదలైందన్నారు. తన సోదరుడి నామినేషన్ చెల్లకుండా చేయాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అనేక కుట్రలు పన్నినా టిడిపి నేతలకు బుద్దిచెప్పేందుకు ఓటర్లు తమ ఓటును వినియోగించుకొన్నారని చక్రపాణిరెడ్డి చెప్పారు.

English summary
Iam stick on my words.. said Bhuma akhilapriya.If Tdp candidate Bhuma brahmandha reddy defeat in Nandyal by poll.. I will resign said Bhuma Akhilapriya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X