అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమర్ధులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాధే: చంద్రబాబు

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై పార్టీ సీనియర్ల అసంతృప్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. కొందరు సమర్థులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాధ కల్గించిందన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై పార్టీ సీనియర్ల అసంతృప్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. కొందరు సమర్థులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాధ కల్గించిందన్నారు.

ఈ నెల 2వ, తేదిన చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.అయితే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ సమయంలో మంత్రిపదవి ఆశించి భంగపడిన నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకులను కాదని ఇతర పార్టీల నుండి వచ్చినవారికి మంత్రిపదవులు కట్టబెట్టడం పట్ల పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణపై నోరు విప్పారు.

పార్టీ నాయకుడు వ్యవహరించిన తీరు పట్ల పార్టీ సీనియర్లు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.అయితే అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ నాయకత్వం ఇంకా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.

సమర్థులకు చోటు కల్పించకపోవడం బాధగా ఉంది

సమర్థులకు చోటు కల్పించకపోవడం బాధగా ఉంది

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ సమయంలో కొందరు సమర్థులకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పట్ల బాధగా ఉందని చంద్రబాబునాయుడు చకెప్పారు. 26 మందికి మించి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం సాధ్యం కాదన్నారాయన.అయితే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించినట్టు ఆయన చెప్పారు.ఈ విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన పార్టీ నాయకులను కోరారు.

మున్సిఫల్ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే

మున్సిఫల్ ఎన్నికల్లో విజయం సాధించాల్సిందే

వచ్చే మున్సిఫల్ ఎన్నికల్లో ప్రతి స్థానంలో కూడ విజయం సాధించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు సూచించారు. సంస్థాగత ఎన్నికలను మహనాడులోపుగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.పనితీరు బాగుంటే ఎన్నికల్లో కుల సమీకరణలు పనిచేయవన్నారు బాబు.

సోషల్ మీడియాలో జరిగే వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి

సోషల్ మీడియాలో జరిగే వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి

పార్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆయన పార్టీ నాయకులను కోరారు.పార్టీ సమస్యలను పార్టీ వేదికలపైనే చర్చించాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు.అంతర్గత సమస్యలపై రొడ్డుమీదకు వెళ్ళకూడదని ఆయన సూచించారు.

పదవులు వచ్చాక పార్టీని పట్టించుకోవడం మానేశారు

పదవులు వచ్చాక పార్టీని పట్టించుకోవడం మానేశారు

కొందరు నాయకులు పదవులు వచ్చాక పార్టీని పట్టించుకోవడం మానేస్తున్నారని మంత్రి లోకేష్ ఘాటుగానే వ్యాఖ్యానించారు.నామినేటేడ్ పోస్టులు దక్కిన తర్వాత పార్టీతో సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారని ఆయన చకెప్పారు. పదవులు తీసుకొన్న ప్రతి ఒక్కరి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని లోకేష్ చెప్పారు.పార్టీ, ప్రభుత్వ పనితీరుపై మీడియాలో వస్తున్న వార్తలపై లోకేష్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

కర్నూల్ జిల్లా నేతలతో బాబు సమావేశం

కర్నూల్ జిల్లా నేతలతో బాబు సమావేశం

కర్నూల్ జిల్లాలో పార్టీ నాయకులతో చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని పార్టీ నాయకుల మద్య నెలకొన్న విబేధాలు, సమన్వయలోపం తదితర అంశాలపై చర్చించారు.స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను కూడ బాబు చర్చించారని సమాచారం.

English summary
iam unhappy for some capable mla's didn't got in my cabinet said Andhrapradesh chiefminister chandrababu naidu on thursday evening.he participated in tdp incharges meeting at amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X