నేను వైఎస్సార్ కొడుకొని, పక్కా "వ్యూహం" - ఎన్నికల "యాత్ర"..!!

ఏపీలో రాజకీయ వ్యూహాలు పీక్ కు చేరాయి. సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా రియల్ లైఫ్ లో జగన్ దూసుకు వెళ్తున్న సమయంలోనే సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి.

ఒక వైపు రాం గోపాల్ వర్మ సిద్దం చేస్తున్న వ్యూహం సినిమా పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా యాత్ర -2 పైన అప్డేట్ ఇచ్చారు. వ్యూహం ట్రైలర్ కు మంచి స్పందన కనిపిస్తోంది. యాత్ర -1 సక్సస్ అవ్వటంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో యాత్ర -2 విడుదల కానుంది.

Iam YSRs Son: Yatra 2 to hit screens in feb, Jagans powerful dialogue irks Chandrababu

యాత్ర 2 కు సిద్దం: యాత్ర సినిమా 2019 ఎన్నికలకు ముందు విడదలయై వైఎస్సార్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. వైఎస్సార్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను మమ్ముట్టి పోషించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా సీఎం జగన్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని 'యాత్ర 2'గా తెరకెక్కుతోంది. మహి వి.రాఘవ్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. 'యాత్ర 2'ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుందని పోస్టర్ ద్వారా తెలిపారు. 2019 ఫిబ్రవరిలో 'యాత్ర' విడుదల అయింది. ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అదే నెలలో, ఎన్నికల ముంగిట 'యాత్ర 2'ని రిలీజ్ చేయనున్నారు. 'యాత్ర 2' కీలక టెక్నీషియన్ల వివరాలను కూడా పోస్టర్‌లో తెలిపారు.

వ్యూహం..యాత్ర 2: తాజాగా ఈ సీక్వెల్‌పై డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘవ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జూలై 8 వైఎస్సార్ జన్మదినం నాడు సినిమాపై అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.జగన్ పాత్ర కోసం తమిళ్ హీరో జీవాను ఖరారు చేసినట్లు సమాచారం.

2019 ఎన్నికల ముందు జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ఆధారంగా ఈ సినిమా సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి మరణం నుంచి తనయుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి మధ్య ఏం జరిగిందనేది సినిమాలో చూపించనున్నారు. యాత్ర 1 లో పూర్తిగా వైఎస్సార్ కు పరిమితం కాగా..యాత్ర 2 పూర్తిగా జగన్ రాజకీయ యాత్రగా సాగుతుందని చెబుతున్నారు.

ఎన్నికల వేళ విడుదల: ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ లో నేనేవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు..కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అంటూ పోస్ట్ జత చేసారు. దీని ద్వారా వైఎస్సార్ కుమారుడిగా ఓదార్పు యాత్ర..ప్రజా ప్రస్థానం యాత్ర..2019 లో అధికారం దక్కించుకొనే వరకూ ఈ సినిమా కధ సిద్దం అయిందని తెలుస్తోంది.

ఇటు వ్యూహం సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ మరణం నుంచి సీఎం జగన్ అయ్యే వరకు సాగిన రాజకీయ పోరాటం ఈ వ్యూహంలో చిత్రీకరించారు. దీని ద్వారా ఇప్పుడు రెండు సినిమాలతో జగన్ పొలిటికల్ లైఫ్ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఎన్నికల వేళ యాత్ర 2 ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+