ఏపీలో 16 మంది ఐఏఎస్‌ల బదిలీ: జాబితా ఇదే
అమరావతి: ఏపీలో 16 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం సంయుక్త కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏ పీవోగా బాలాజీరావు, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా ఎ. మల్లికార్జున, రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వి. విజయరామరాజు, గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్‌గా ఎస్. నాగలక్ష్మిని ప్రభుత్వం నియమించింది.

విజయవాడ సబ్ కలెక్టర్‌గా సృజన, రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా విజయకృష్ణన్, రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా రవి సుభాష్ పట్టణశెట్టి, తిరుపతి సబ్ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, పాడేరు సబ్ కలెక్టర్‌గా శివశంకర్ లేతేటి, నూజివీడు సబ్ కలెక్టర్‌గా జి. లక్ష్మీ షా, కుక్కునూరు సబ్ కలెక్టర్, కేఆర్ పురం ఐటీడీఏ పీవోగా సగలి షాన్ మోహన్, మదనపల్లి సబ్ కలెక్టర్‌గా కృత్తికా బాత్రా, నరసాపురం సబ్ కలెక్టర్‌గా దినేశ్ కుమార్‌లు నియమితులయ్యారు.
వీరితో పాటు ఏపీ డెయిరీ డెవలెప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా జె. మురళి, హైదరాబాద్ సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా బి. రామారావు, వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శ్వేతా తియెతియా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications