బెజవాడ టు హైద్రాబాద్: ప్రత్యేక రైళ్లు కావాలన్న్ ఐఏఎస్‌లు, 'డబుల్'కు బాబు నో
హైదరాబాద్/విజయవాడ: ఈ ఏడాదిలోనే హైదరాబాదులోని అధికారులందర్నీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం తాత్కాలిక సచివాలయాన్ని ప్రభుత్వం తలపెట్టింది. అయితే, సచివాలయం పూర్తయ్యాక.. హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రత్యేక రైళ్లు వేయాలని కోరుతున్నారు.
పలువురు ఐఏఎస్ అధికారులు ఈ సౌకర్యాలు కావాలని అంటున్నారు. సచివాలయం పూర్తయ్యాక, అమరావతి నుంచి పని చేసేందుకు తాము సిద్ధమని, అయితే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వారానికి రెండుసార్లు రైలు సదుపాయం కావాలని కోరుతున్నారు.
తాము సోమవారం నుంచి శుక్రవారం వరకు రాజధాని అమరావతి ప్రాంతంలో పని చేస్తామని, శని, ఆదివారాలు హైదరాబాదులో తమ కుటుంబాలతో గడిపేందుకు.. శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్, సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రత్యేక రైలు కావాలని సిఎస్ ఎస్పీ టక్కర్‌కు ఐఏఎస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
మిగతా ఉద్యోగులు కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. అయితే, ఉద్యోగులకు తాము హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) ఒకటి మాత్రమే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. విజయవాడలో, హైదరాబాదులో.. రెండుచోట్ల ఉంటే రెండుచోట్ల హెచ్ఆర్ఏ ఇవ్వమని చెప్పారని తెలుస్తోంది.
అమరావతి ప్రాంతంలో 30 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. అదే సమయంలో కొందరిని హైదరాబాదులోని క్వార్టర్సులో ఉండేందుకు అంగీకరించింది. అయితే, రెండుచోట్ల ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేదని చెప్పవచ్చు.

అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం
దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ, ఉపాధి కల్పన, దళిత, గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాల పెంపు తమ ప్రభుత్వ లక్ష్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వేరుగా స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎలాంటి భేషజాలు లేకుండా ఈ లక్ష్యాల సాధన దిశగా కచ్చితంగా పని చేయాలన్నారు.
కార్పొరేట్‌కు మించిన స్థాయి వసతులతో రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందించాలని ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆపైన ఖర్చయినా సరే నైపుణ్య శిక్షణనిప్పించి కచ్చితంగా ఉపాధిని కల్పిస్తామని ముందుకు వచ్చే సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై గురువారం ఏపీ సచివాలయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను లక్ష్యం కోసమే ఖర్చు చేయాలని, ఇతర పనులకు వినియోగించడానికి వీల్లేదన్నారు.
అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు సీఎంను కోరగా.. దేశం గర్వించేలా విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించనున్నారు.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications