అమరావతికి ఐసీసీ గుడ్ న్యూస్..! దేశంలోనే అతిపెద్ద స్టేడియం?

ఏపీ రాజధాని అమరావతికి ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు ఓవైపు చురుగ్గా సాగుతున్నాయి. అదే సమయంలో ఇందులో భాగమైన స్పోర్ట్స్ సిటీలో కీలక మైన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందులోనే దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని సంకల్పించింది. ఈ స్పోర్ట్స్ సిటీలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అమరావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

icc nod to biggest international cricket stadium in Amaravati capital

విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని చిన్ని ఈ విషయాన్ని వెల్లడించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఛైర్మన్‌ జైషా అనుమతి ఇచ్చినట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. రెండు నుంచి రెండున్నర ఏళ్ల లోపల పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకారం అందిస్తుందని కేశినేని చిన్ని వివరించారు.

మనదేశంలో ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియం.. దేశంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందింది. అయితే ఈ స్టేడియాన్ని మించేలా లక్షా 32 వేల సీటింగ్ సామర్థ్యంలో అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అమరావతిలో 60 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఏసీఏ కోరుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులోనే అమరావతి స్టేడియం నిర్మించాలని ఏసీఏ భావిస్తోంది.

మరోవైపు రాష్ట్రంలోని రెండు క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయనగరం, మూలపాడులో క్రికెట్ అకాడమీలను పెడుతున్నట్లు వివరించారు. ఇక విశాఖపట్నంలోని ఏసీఏ - వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండు నెలల్లోనే మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల తర్వాత స్టేడియంలోని ఎలివేషన్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 30 మైదానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేశినేని చిన్ని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+