వైసీపీకి షాక్.. పవన్ కల్యాణ్ కు మద్దతు తెలిపిన అల్లు అర్జున్?
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సమయం ఎంతోదూరంలో లేదు. అన్ని పార్టీలు విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో నేతలంతా ప్రచారాన్ని ఉధృతం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పవన్ ను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తోంది. అయినా గెలుపు తనదే అనే ధీమాలో పవన్ ఉన్నారు.
పవన్ కు మద్దతుగా సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, పృథ్వీరాజ్ తదితరులు ప్రచారం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రేపో మాపో పిఠాపురం రాబోతున్నారు. బీజేపీ నేత, సినీ నటి ఖుష్ బూ కూడా పవన్ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరలవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమాలో ఓ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది.

ఆ పాటలో అల్లు అర్జున్ టీ గ్లాస్ పట్టుకుని అదిరిపోయే స్టెప్పులు వేశారు. గాజు గ్లాస్ తో బన్నీ డాన్స్ చేయడంతో నెటిజన్లు పవన్ కల్యాణ్ కోసమే అలా చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు అన్న విషయం తెలిసిందే. ఎన్నికలవేళ ఈ తరహా డ్యాన్స్ తో పాటను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ పరోక్షంగా మద్దతిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ బహిరంగంగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలికే అవకాశం ఉండకపోవచ్చని, వారికి అన్నివర్గాల్లోను అభిమానులు ఉండటంతో వారిని దూరం చేసుకోవడం ఇష్టం లేక తటస్థంగా వ్యవహరించడమే మేలనే అభిప్రాయానికి వచ్చారంటున్నారు. చిరంజీవి మాత్రం తమ్ముడి కోసం రెండురోజులు ప్రచారం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications