టీడీపీ లేకుంటే కేసీఆర్ సిద్దిపేటలో గొర్రెలు మేపేవారు: చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనేది లేకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్ధిపేటలో గొర్రెలు మేపుకునేవారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుందామంటే కేసీఆర్ ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందన్నారు.

భౌగోళికంగా విడిపోయినా తెలుగు జాతి కలిసుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేంద్ర సహకారంతో సమస్యలు అన్నింటిని పరిష్కరించుకోవచ్చన్నారు. రెండు రాష్ర్టాలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. నెలలోగా ఆస్తుల పంపకం పూర్తవ్వాలని, రాష్ట్రాన్ని విభజించిన వారు అసూయపడేలా కసిగా అభివృద్ధి చేసుకుందామన్నారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు రెండు ఓడరేవులు వచ్చే అవకాశముందని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని వాడుకునేందుకే పట్టిసీమ అన్నారు. పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. పింఛన్లు ఐదురెట్లు పెంచిన ఘనత తమదే అన్నారు.












Click it and Unblock the Notifications