విజయసాయిరెడ్డి ఎఫెక్ట్: షాకింగ్ మెలిక, రాజీనామాపై మళ్లీ దొరికిపోయిన జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాపై ఎంపీల రాజీనామా అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి దొరికిపోయారు. అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

  YSRCP MPs Will Resign on April 6th, Chandrababu Reaction

  చదవండి: జగన్‌కు రివర్స్, ఇరుకునపడ్డ వైసీపీ: 'డబుల్' షాక్, వీటికి సమాధానం ఏది?

  చదవండి: అద్భుతం, ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే లేదు, బాబును లైట్‌గా తీసుకున్నా: ముఖేష్ అంబానీ ప్రశంసలు

  ఇప్పటికే, జగన్ చేసిన రాజీనామా ప్రకటనపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ప్రకటన అంతా డ్రామా అని, ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావని, అందుకే కొత్త నాటకానికి తెరలేపారని అంటున్నారు.

  చదవండి: రాజీనామాపై జగన్ పక్కా ప్లాన్: సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది? విజయసాయికి మాత్రం ఉపఎన్నిక షాక్

  విజయసాయి రెడ్డి రాజీనామాపై ట్విస్ట్

  విజయసాయి రెడ్డి రాజీనామాపై ట్విస్ట్

  తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ బుధవారం చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మరో ఆయుధాన్ని అందించినట్లు అయింది. తమ పార్టీకి చెందిన లోకసభ సభ్యులు రాజీనామా చేస్తారని, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చేయరని చెప్పారు.

  విజయసాయి రెడ్డి ఎందుకు చేయరంటే, ఆసక్తికర మెలిక

  విజయసాయి రెడ్డి ఎందుకు చేయరంటే, ఆసక్తికర మెలిక

  లోకసభ ఎంపీలు ఎందుకు రాజీనామా చేస్తారు, విజయ సాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేయరు అనే విషయాన్ని కూడా బొత్స చెప్పారు. లోకసభ ఎంపీలను ప్రజలు ఎన్నుకున్నారని, కానీ విజయసాయి అలా ఎన్నుకోబడలేదని అందుకే ఆయన చేయరని ఆసక్తికరమైన మెలిక పెట్టారు.

  టీడీపీ నేతల వ్యాఖ్యలు నిజం చేస్తున్నారా

  టీడీపీ నేతల వ్యాఖ్యలు నిజం చేస్తున్నారా

  ఈ ప్రకటనతోనే ప్రత్యేక హోదా విషయంలో వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి తెలిసిపోతుందని కొందరు అంటున్నారు. టీడీపీ నేతల విమర్శలు కూడా నిజం అవుతున్నాయని అంటున్నారు. ఏడాదికి ముందు ఎన్నికలు రావనే వారి వ్యాఖ్యలను ఇలా నిజం చేస్తున్నారని అంటున్నారు. ఇది వైసీపీకి దెబ్బే అంటున్నారు.

  చదవండి: ఏడాది ముందు కాదు, ఎలాగంటే: రాజీనామాలపై వైసీపీ వైవీ ట్విస్ట్, బీజేపీ ఎంపీ ఆగ్రహం

  2022 వరకు విజయసాయి రెడ్డి రాజ్యసభ టర్మ్

  2022 వరకు విజయసాయి రెడ్డి రాజ్యసభ టర్మ్

  టీడీపీ నేతల వ్యాఖ్యలను బట్టి లోకసభ ఎంపీలు రాజీనామా చేస్తే, ఆమోదించినా ఆమోదించకున్నా ఏడాదిలో ఉప ఎన్నికలు రావు. అలాగే అప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్తుంది. కాబట్టి ఎంపీలకు వచ్చిన నష్టం లేదు. కానీ విజయ సాయి రెడ్డి రాజ్యసభ టర్మ 2022 వరకు ఉంది. అందుకే ఆయన రాజీనామా చేయడం లేదని అంటున్నారు. ఎంపీలు రాజీనామా చేసినా ఏడాదిలో ఎన్నికలు వస్తాయి. విజయ సాయి కోసం మళ్లీ ఉప ఎన్నికల రిస్క్ తీసుకునే ఉద్దేశ్యం లేనట్లుగా చెబుతున్నారు. అయితే దీనిపై పార్టీ ముందు ముందు మరో నిర్ణయం తీసుకుంటుందా చూడాలి.

  చదవండి: జగన్‌కు ఊహించని షాక్, ప్రశ్నలు: ఎదురు తిరిగిన 'రాజీనామా', అనాలోచితమా?

  వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం

  వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం

  ఏప్రిల్ 6న ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామన్న వైసీపీపై ఇప్పటికే టిడిపి మాటల దాడి చేస్తోంది. హోదా ఇవ్వమని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అలాంటప్పుడు వైసీపీకి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే రాజీనామా చేయాలని సవాల్ చేస్తున్నారు. రెండు నెలల తర్వాత చేస్తే ఎలాగూ ఉప ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతోనే జగన్ పక్కా ప్లాన్‌తో ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయాలని వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

  రాజీనామా అంతా ట్రాష్

  రాజీనామా అంతా ట్రాష్

  అంతేకాదు, జగన్ రాజీనామా అంతా డ్రామా అని, రెండేళ్ల క్రితమే రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఇన్నాళ్లు ఏం చేశారని, ఆ తర్వాత నాలుక మడతేశారని, ఏప్రిల్ 6వ తేదీ వరకు కూడా ఎన్నిసార్లు మాట మారుస్తారో చూద్దామన్నారు.

  చదవండి: జగన్‌ను అలా అన్నా, సారీ: మోడీ-జగన్‌లకు చెక్ పెట్టేందుకు జేసీ ప్లాన్, పవన్‌కు చెప్పేశా

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  If YSRCP Rajya Sabha member Vijay Sai Reddy tenders his resignation, a by election is certain as his Rajya Sabha term ends in 2022.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి