ఐఐటి జెఇఇ: టాప్ టెన్‌లో ముగ్గురు తెలుగు విద్యార్థులు

హైదరాబాద్: ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ తుది ర్యాంకులను సిబిఎస్‌ఇ మంగళవారం రాత్రి ప్రకటించింది. జాతీయస్థాయి టాప్ 10 ర్యాంకుల్లో ముగ్గురు తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకుని సత్తా చాటారు. తుది ర్యాంకులతోపాటు సిబిఎస్‌ఇ అడ్మిషన్ల షెడ్యూలును సైతం సిబిఎస్‌ఇ ప్రకటించింది.

గతంలో కేవలం మెయిన్స్ మార్కుల ఆధారంగా ప్రకటించిన ర్యాంకులు తాజాగా తుది ర్యాంకుల ప్రకటనతో తారుమారయ్యాయి. గతంలో పెద్ద ర్యాంకు సాధించిన వారు తాజాగా మంచి ర్యాంకులు సాధించగా, గతంలో మంచి ర్యాంకులు సాధించిన వారు జాబితా దిగువకు వెళ్లిపోయారు. తొలి 10 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు.

IIT JEE: Telugu students in top ten

జాతీయస్థాయిలో రెండో ర్యాంకును దోర్నాదుల శ్రీలేఖ కైవసం చేసుకోగా, ఏడొవ ర్యాంకును పాలబట్ల సింథూజ, 9వ ర్యాంకును మాగంటి నిఖిల్ హర్ష సాధించారు. గతంలో మెయిన్స్ మార్కుల ఆధారంగా ఇచ్చిన ర్యాంకులు, ప్లస్ మార్కుల వెయిటేజీ కలపడంతో తారుమారయ్యాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో అగ్రగామిగా ఉన్న తెలుగు విద్యార్థులు తాజా జాబితాలో ఆ ఘనతను కోల్పోయారు.

డి శ్రీలేఖ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 335 మార్కులతో 471వ ర్యాంకు సాధించింది. పి సింధూజ 335 మార్కులతో 342వ ర్యాంకు సాధించింది. నిఖిల్ హర్ష 321 మార్కులతో 745వ ర్యాంకు సాధించాడు. అయితే వీరు మెయిన్స్‌లో తమసత్తా చాటి అగ్రస్థానాన్ని అందుకున్నారు. కేవలం మెయిన్స్ మార్కుల ఆధారంగానే టాప్ 10లో చోటు దక్కించుకున్న ఎన్ పవన్‌కుమార్ తాజా జాబితాలో దిగువకు వెళ్లిపోయారు.

ఎమ్సెట్‌లో టాప్ 10లో ర్యాంకు దక్కించుకున్న సి సాయి చేతన్ జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో రెండో ర్యాంకు సాధించారు. అయితే మెయిన్స్ ర్యాంకులో మాత్రం దిగువకు వెళ్లిపోయారు. కేవలం ప్రవేశ పరీక్షలో మార్కుల ఆధారంగానే టాపర్లుగా నిలిచిన తెలుగు విద్యార్థులు అర్హత పరీక్షలోనూ మంచి మార్కులు సాధించుకోవడంతో జాతీయ స్థాయి ర్యాంకులను దక్కించుకోగలిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+