ఏపీ ప్రజలకు అలర్ట్ - అప్రమత్తంగా ఉండాల్సిందే..!!

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈ రోజు, రేపు ఎండ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఎండలకు తోడు వడగాలులు ప్రతాపం చూపిస్తాయని వెల్లడించింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో ఆరు జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే మండలాలను ప్రకటించింది. ముఖ్యంగా వ్రుద్దుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. సాధారణ కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్ల ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రంగా ఉంటోంది. ఆదివారం గరిష్ఠంగా 41 డిగ్రీలక పైగా ఉష్ణోగ్రత నమోదైంది. సోమ, మంగళ వారాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశ ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. మండుతున్న ఎండలకు తోడు వడగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం 8 మండలాల్లో వాటి ప్రభావం కనిపించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాటి ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.

heat wave alert

ఈ రోజు (సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లోని 27 మండలాల్లో, మంగళవారం 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితులతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 44.8 డిగ్రీలు, కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమదో కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రికార్డు అయిన ఉష్ణోగ్రతల్లో ఏలూరు జిల్లా పూళ్ల, విజయనగరం జిల్లా రాజాం, ప్రకాశం జిల్లా తర్లుపాడుల్లో 41.5 డిగ్రీల మేర నమోదు అయింది. ఏలూరు జిల్లా దెందులూరు, తూర్పుగోదావరి జిల్లా కొమరి పాలెం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం వడగాలులు వీచే అవకాశం ఉన్న 27 మండలాలను ఐఎండీ ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+