బంగాళాఖాతంలో వాయుగుండం: విశాఖకు 1320 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
దక్షిణ అండమాన్‌లో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం నాడు తెలిపారు.
విశాఖ: దక్షిణ అండమాన్‌లో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం నాడు తెలిపారు.
ఇది మరింత బలబడి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారి, తర్వాత తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫానుగా మారితే ఏపీలో తీరం దాటే అవకాశముంది. ఇప్పటికే అండమాన్‌లో వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 1320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 48 గంటల్లో తీవ్ర వాయుగుండం తుపానుగా మారే సూచనలున్నాయని అంచనా వేశారు. వాయుగుండం మరో 72 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముంది.












Click it and Unblock the Notifications