బంగాళాఖాతంలో మరో అల్పపీడనం- ఏపీలో అతి భారీ వర్షాలు

Bay of Bengal: కిందటి నెల బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ప్రభావం వల్ల మూడు రాష్ట్రాలు గజగజ వణికాయి. భారీ వర్షాలు తీర ప్రాంత జిల్లాలను అల్లకల్లోలానికి గురి చేశాయి. లోతట్టు ప్రాంతాలను ముంచివేశాయి. దాదాపు ఏడు లక్షల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించాల్సి వచ్చింది.

దానా తుఫాన్ ప్రభావం ఏపీపైనా కనిపించింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.

IMD forecasts the formation of a low pressure area over the Bay of Bengal by November 6

ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది మరింత బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ ఉపరితల ఆవర్తనం ఈ నెల 5 లేదా 6 తేదీల నాటికి అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది.

దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావొచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది.

IMD forecasts the formation of a low pressure area over the Bay of Bengal by November 6

ఆయా జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

ఈ అల్పపీడన ప్రభావం అటు తమిళనాడుపైనా ఉండొచ్చు. చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, కాంచీపురం, తిరుపత్తూర్, కడలూర్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కిందటి నెల ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో చెన్నైలో అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ అల్పపీడనం వల్ల మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+