ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు-ఈ జిల్లాల్లో కుండపోత ఖాయం-ఐఎండీ వార్నింగ్..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తుండగా.. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండొచ్చని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులు అలర్ట్ అవుతున్నారు.

బంగళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఇవాళ మంగళవారం రాష్ట్రంలోని పల్నాడు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం ఎక్కువగానే ఉండబోతోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు వచ్చి మూడునెలలవుతున్నా అరకొర వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులు, ఇతర వర్ఘాలకు ఈసారి మాత్రం ఆ బెంగ తీరిపోయేలా కనిపిస్తోంది.

IMD Heavy Rain Alert to these ap districts from today-here are details

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి వాతావరణ విభాగం అందించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరులో అత్యధికంగా నిన్న 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. సత్యసాయి జిల్లా ధర్మవరంలో 8 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లా అద్దంకి, నంద్యాల జిల్లా ఆత్మకూరు, ఇదే జిల్లాలోని డోన్ లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి, విజయనగరం వంటి జిల్లాల్లోనూ ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి.

ఈ ఏడాది ఆగస్టులో దేశంలో గత వందేళ్లలో అత్యల్ప వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. దీంతో నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపే చివరి నెల అయిన సెప్టెంబర్ లో అయినా వర్షాలు స్ధిరంగా కురుస్తాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లేకపోతే ఈ ఏడాది పంటలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దశలో వాతావరణ విభాగం ఇస్తున్న సంకేతాలు రైతుల్లో ఆశలు చిగురింపచేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+