ఉపరితల ఆవర్తనం, పిడుగులతో వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ జారీ చేసింది. అదే విధంగా రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. ఏపీ తో పాటుగా తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాల పైన స్పష్టత ఇచ్చింది.
ఏపీలో వర్షాల పై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్లూరి సీతారామ రాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు మోస్తారుగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దానితోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అదే విధంగా రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, గూటి, పొదిలి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేటలోనూ వర్షాలు కురువన్నాయి.

మూడు రోజులు పాటు భారీ వర్షాలు
కాగా.. గొట్టిప్రోలు పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రజలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తలు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. అయితే, అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా, సూర్యాపేట, ఖమ్మం అంతటా చెదురుమదురు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. అలాగే హన్మకొండ, భద్రాద్రి - కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్కర్నూల్, ఆసిఫాబాద్, మంచిర్యాల మీదుగా ఈ వర్షాలు విస్తరించే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.













Click it and Unblock the Notifications
