మరో తుఫాను ముప్పు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!

ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. తాజాగా వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరిక చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనతో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇది క్రమంగా అల్పపీడనంగా బలపడ నుంది. అది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయు గుండంగా రూపాంతరం చెంది, ఈ నెల 17 నాటికి ఏపీ సమీపంలోనే తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

భారీ వర్షాలు
అల్పపీడనం క్రమేణా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో దక్షిణ కోస్తా - ఉత్తర తమిళనాడు మధ్య తీరం తాకవచ్చని అంచనా వేస్తున్నారు. అల్ప పీడనం ఏర్పడిన తరువాత దీని కదలిక పైన పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఏపీలోకి దక్షిణ కోస్తా ప్రాంతంలో పాటుగా ఉత్తర తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

IMD Predicts Heavy to heavy rain fall in next 3-4 days

ఈ జిల్లాలపై ప్రభావం
ప్రధానంగా ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటుగా సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించింది. అదే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,పల్నాడు, నెల్లూరు, వైయస్ఆర్,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. .

ఐఎండీ అంచనా
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బల పడింది. కర్ణాటక, గోవా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+