మరో అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు - తాజా హెచ్చరిక..!!
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం కొనసాగుతున్న వేళ వర్షాల పైన ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఈ నెల 29న మరో అల్ప పీడనం ఏర్పడనుంది. ఫలితంగా సెప్టెంబర్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఆగస్టు 29న వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల సమీపంలో నూతనంగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వాతావరణంలో గణనీయమైన మార్పులు రానున్నాయని వివరించింది. దీంతో.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబరు 2 వరకు తేలికపాటి నుండి మోస్తరు మరియు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది వర్షపాతం లోటుగానే నమోదవుతోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు దేశంలో సగటు వర్షపాతం 13 శాతం లోటుగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో 27 శాతం, దక్షిణ భారతదేశంలో 22 శాతం లోటు నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ కొన్ని ప్రాంతాల్లో వేసవిని తలపించే వాతావరణ పరిస్థితులు కనిపిస్తు నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తాజా అల్పపీడనం వల్ల ఏపీలో వర్షాలు పెరుగుతా న్న ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీలో పలు ప్రాంతాల్లో రెండో వేసవి కొనసాగుతోంది. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అటు తెలంగాణలో స్వల్పంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో అల్ప పీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications