గుజరాత్ లో బిజెపి గెలుపు...ఎపికి, చంద్రబాబుకి ఇబ్బందేనా?...

గుజరాత్ లో బిజెపి గెలిచింది...ఈ విజయంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మరి ఆ పార్టీ మిత్ర పక్షాలు... అవి కూడా సంతోషంగానే ఉన్నాయా...అదేంటి...బిజెపి గెలిస్తే ఆ పార్టీ మిత్రపక్షాలు సంతోషంగా ఎందుకు ఉండవు అనే సందేహం వస్తుందా?...కానీ వాస్తవం మాత్రం అదే...ప్రత్యేకించి గుజరాత్ లో బిజెపి గెలుపు ఎపిని,టిడిపిని చిన్నబోయేలా చేశాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం...అదెలాగో చూద్దాం...

Recommended Video

    గుజరాత్ ఎఫెక్ట్ : AP & TS కి మంచి కాలమేనా, కలిసొచ్చేనా?

    నిజానికి గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ గెలుపుతో ఎపిలో బిజెపి శ్రేణుల్లో మాత్రమే కాకుండా కేంద్రం, రాష్ట్రంలో ఆ పార్టీ కూటిమిలో భాగస్వామ్యం ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆనందం వెల్లివిరియాలి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుధ్దంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు గుజరాత్ లో బిజెపి ఓడిపోవాలని ఆంధ్రా అభిమానులు చాలామంది కోరుకున్నారట.

     అంతకుముందు..

    అంతకుముందు..

    గతం గురించి పక్కనబెడితే 2014 ఎన్నికల్లో పోరాటానికి బిజెపి,టిడిపి పొత్తుపెట్టుకొని బరిలోకి దిగాయి. ఆ తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో విజయభేరి మోగించాయి. ఎన్నికల నాటికే రాష్ట్ర విభజన జరగడం వల్ల దారుణంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు 2014 నుంచి 2019 వరకూ ఆ ఐదేళ్ళ సమయం అత్యంత విలువైనది...కీలకమైనది. ఎపి భవిష్యత్తు ఈ ఐదేళ్ల కాలంలో వేసే పునాది మీదే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. కారణాలేమైనప్పటికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చంద్రబాబుకు పట్టం కట్టారు. ఆ విజయం చంద్రబాబు సమర్థతను చూసి ప్రజలిచ్చారని ఆ పార్టీ అంటే, మోడీతో కలవడం వల్లేనని బిజెపి శ్రేణులు, పవన్ కళ్యాణ్ మాటలతో కాపులు మోసపోవడం వల్లే టిడిపి గెల్చిందని వైసిపి అభిమానులు, జగన్ ను తిరస్కరించేందుకు బాబుకు పట్టం కట్టారని కాంగ్రెస్ వాదులు ఇలా ఎవరి విశ్లేషణలు వారు చేశారు.

    ఆ తరువాత...

    ఆ తరువాత...

    అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కాని టిడిపి,బిజెపి పైకి బాగానే కనిపిస్తున్నా పేరుకి మిత్రపక్షాలుగా ఉన్నా శత్రువుల కంటే ఎక్కువగా ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. మొదట్లో ఎపికి కేంద్రం బాగానే సహకరిస్తోందన్న చంద్రబాబు ఆ తరువాత కేంద్రం ఆశించిన రీతిలో నిధులు ఇవ్వడం లేదనే మాటనక తప్పని పరిస్థితి వచ్చింది. తొలుత ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన టిడిపి ఆ తరువాత కేంద్రం తీరుతో ప్రత్యేక హోదానే బెటర్ అనేసింది. రెవిన్యూ లోటు విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు భిన్నంగా ఉన్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టుతో ఈ రెండు పార్టీల మధ్య అంతరం తిరిగి పూడ్చలేనంతగా పెరిగిపోయింది. 2014 లో 16000 వేల కోట్లరూపాయలుగా ఉన్న ఈ ప్రాజెక్టు వ్యయం అంచనా అంచెలంచెలుగా పెరుగుతూ ఏభై ఎనిమిది వేల కోట్లకు వెళ్లిపోయింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం వేసిన లెక్కే. నిజానికి ఈ ప్రాజెక్టును కేంద్రం పూర్తిగా చేపట్టవలసి ఉంది. చట్టంలో ఆ విషయం స్పష్టంగా ఉంది.కాని చంద్రబాబు తనకే అప్పగించాలని కేంద్రాన్ని కోరడం, ప్రధాని మోడీ, కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లిలు దానిని చంద్రబాబు ఇష్టానికి వదలివేయడంలో మతలబును బాబు అర్థం చేసుకోకపోడం వల్లే ఈ పరిస్థితి చేసుకుంది.

     అసలు ఆ పనే చేసుంటే...

    అసలు ఆ పనే చేసుంటే...

    అదే కేంద్రంపైనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత పెట్టి ఉంటే ప్రాజెక్టు వ్యయం పెరిగినా, భూ సేకరణ వ్యయం పెరిగినా కేంద్రానిదే బాధ్యత అయి ఉండేది. నిర్దిష్ట కాల వ్యవధిలో ప్రాజెక్టును నిర్మించవలసిన కర్తవ్యం కేంద్రానికి ఉండేది. కాని చంద్రబాబు కారణమేదైనా ప్రాజెక్టు నిర్మాణం తాను తీసుకుని , ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్లను మార్చడం, ఇప్పుడు మెయిన్ కాంట్రాక్టర్ ను కూడా మార్చాలని ఆలోచించడం,ఆ ప్రాజెక్టులో డబ్బు ఖర్చు చేస్తున్న తీరు అనేక ఆరోపణలకు దారితీసింది. పెద్దఎత్తున అవినీతికి పాల్పడేందుకే చంద్రబాబు ఇలా పోలవరం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకున్నారని విపక్షాలు ఆరోపించడానికి ఆయనే అవకాశం ఇచ్చినట్లయింది.

     ఎపితో బిజెపి ఇలా...

    ఎపితో బిజెపి ఇలా...

    ప్రత్యేక ప్యాకేజీ విషయం లో కూడా గందరగోళం ఉంది. నిజానికి విదేశీ ఆర్దిక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయ్యాల్సి ఉంది. అయితే వాటికి కూడా కేంద్రం సాయం చేయడం లేదని, ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నా కేంద్రం నుంచి ఆశించిన నిధులు రావడం లేదని చంద్రబాబే కొన్ని సందర్భాల్లో అన్నారు. అలాగని ఈ విషయాలపై గట్టిగా మోడీ ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం చంద్రబాబు చెయ్యడం లేదు. ఇందుకు కారణాలేమైనా కావచ్చు. కానీ ఈ తీరు రాష్ట్రానికి చాలా నష్టం చేస్తోంది.

     ఇక్కడ కూడా టిడిపి వర్సెస్ బిజెపి...

    ఇక్కడ కూడా టిడిపి వర్సెస్ బిజెపి...

    అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏ విషయంలోను నిజాయితీగా ఉండడం లేదని, చంద్రబాబు చెప్పే వాటిలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని పరిస్థితి ఏర్పడిందని కొందరు బిజెపి నేతల వాదన. అందువల్లే ఎపి ప్రభుత్వ విశ్వసనీయతకు కేంద్రంలో భంగం వాటిల్లుతోందని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు తనకు కేంద్రం పూర్తిగా సహకరించడం లేదని చెప్పడం ద్వారా తప్పంతా బిజెపి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే,ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్నతప్పుడు విదానాల వల్ల ఎదురవుతున్న సమస్య అని బిజెపి నేతలు తిప్పికొడుతున్నారు.

     చంద్రబాబుకు మోడీ నో అపాయింట్మెంట్...

    చంద్రబాబుకు మోడీ నో అపాయింట్మెంట్...

    చంద్రబాబు మోడీ హవాకి ముందే ఎన్డీయే భాగస్వామి. ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధానులను సైతం మార్చేసిన కీలక నేత. వాజపేయి ప్రభుత్వంలో సైతం ఆయన మాటకు తిరుగులేదు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కలగూరగంపను ఒక్కటిగా చేసి దేశ రాజకీయాల్లో రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఢిల్లీ కోటపై ఎగురవేసిన రాజకీయ చతురుడు. ముఖ్యమంత్రిగా, పొలిటికల్ గా మోడీ కంటే చాలా సీనియర్. కానీ అలాంటి చంద్రబాబుకు రెండేళ్లు గా ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కరువైంది. ఢిల్లీ లో పడిగాపులు కాసినా ఆయన కన్నా కింది స్థాయిలో వ్యక్తులనైనా మోడీ కలిశారు తప్ప చంద్రబాబుకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడంలేదు.

    ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలు...

    ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలు...

    ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ ఎన్నికలు రావడంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని టిడిపి నేతలు కోరుకున్నారట. అప్పుడయినా
    ప్రధాని మోడీ భాగస్వామ్య పార్టీలను, మిత్రపక్షాలను , చంద్రబాబును పట్టించుకుంటారని ఆశించారట. అయితే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు చూసిన తర్వాత వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఆ తరువాత ఫలితాలు కాస్త అటూ ఇటూ అయినా విజయం మాత్రం మోడీనే వరించడంతో మొహాలు చిన్నబోయాయి.

     చంద్రబాబుకి ఇబ్బంది...

    చంద్రబాబుకి ఇబ్బంది...

    అయితే గుజరాత్ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే నరేంద్రమోడీని బ్రతిమాలో, బెదిరించో కనీసం ప్యాకేజ్‌కి చట్టబద్ధత తెప్పించి పరువు నిలబెట్టుకోవాలన్నఆశ చంద్రబాబులో, టిడిపి నేతల్లో కనిపించింది. అయితే గుజరాత్‌లో బిజెపి తిరుగులేని విజయం సాధించడంతో ఇక మోడీకి తిరుగుండదు. పైగా హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బిజెపినే విజయం సాధించింది. మోడీ బలం ఇంకా పెరిగింది. దీంతో మోడీ బలం ఇంకా పెరిగింది. రెండేళ్ల నుంచి తనకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్న మోడీతో ముందు ముందు ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన చంద్రబాబుకు ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

    ఎపి కి కూడా ఇబ్బందేనా...

    ఎపి కి కూడా ఇబ్బందేనా...

    ఇప్పటి వరకూ మోడీ నుంచి రాష్ట్రానికి ఒక్కటైనా సరైన ప్రయోజనాన్ని చంద్రబాబు రాబట్టలేకపోయారన్నది కఠిన సత్యం. గుజరాత్ విజయంతో మరింత బలపడిన మోడీని ఇకపైన చేయగలిగేదీ ఏమీ ఉండదు. విభజనతో సర్వం కోల్పోయిన ఆంద్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడంతో సహా ఎంతో కీలకమైన ఈ ఐదేళ్ళ కాలంలో ఎపికి ఎలాంటి ప్రయోజనాలూ దక్కకపోవడం గమనించాల్సిన విషయం. 2019లోపు విభజన చట్టంలో ఉన్న కేంద్ర హామీలు ఏవీ అమలు కాకపోతే, రాజధానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోతే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాల నుంచి వాటిని రాబట్టడం చాలా కష్టమని రాజకీయ,ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    మరేం చెయ్యాలి? ఏం చేస్తారు?

    మరేం చెయ్యాలి? ఏం చేస్తారు?

    మరి మోడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కనీసం తనకు అపాయింట్ మెంట్ కూడా ఇప్పించుకోలేకపోతున్న చంద్రబాబు ఇక ముందు మోడీకి తలొగ్గి ఆయన కోరుకునేవిధంగా జీ హుజూర్ అనడం ద్వారా ఏమైనా సాధించగలుగుతారా? లేక ప్రతికూల పరిస్థితుల్లో ఎదురొడ్డి పోరాటానికి దిగుతారా? భాగస్వామిగానే ఉండి పోరాడతారా? లేక భాగస్వామిగా ఉండి సాధించలేకపోయిన వాటిని పోరాడి సాధించే ప్రయత్నం చేస్తారా అనే ప్రశ్నలకు అతి కొద్ది కాలంలోనే సమాధానం లభించనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+