వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత.!రైతును రాజుగా మార్చే బడ్జెట్ ఇదే అంటున్న వైసీపి నేతలు.!
అమరావతి/హైదరాబాద్ : ధర్మాన కృష్ణదాస్ గురువారం శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మక సందర్భంగా వైసిపి నేతలు అభివర్ణిస్తున్నారు. వ్యవసాయమే ఊపిరిగా సాగే కృష్ణదాస్, రైతు సంక్షేమమే తన శ్వాసగా మార్చుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ బడ్జెట్లో అన్నదాతల ఆశలు వందకు వంద శాతం నెరవేరేలా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసారు ఇతర వైసీపి నేతలు.
వ్యవసాయ రంగ బడ్జెట్ లో కేటాయింపుల హైలైట్స్ ఇవే..

వ్యవసాయ బడ్జెట్ రూ.68,000 కోట్లు
రైతు భరోసా, పీఎం కిసాన్ కోసం రూ.17,030 కోట్లు
సున్నా వడ్డీ పంట రుణాల కోసం రూ.573 కోట్లు
వైఎస్సార్ ఉచిత పంట బీమా కోసం రూ.1,252 కోట్లు
పంట నష్ట పరిహారం కోసం రూ.1,038 కోట్లు
ధాన్యం కొనుగోళ్లకు రూ.18,343 కోట్లు
ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రూ.4,761 కోట్లు
ఉచిత విద్యుత్తు కోసం రూ.17,430 కోట్లు
విద్యుత్ ఫీడర్ల చానెళ్ల సామర్థ్య పెంపునకు రూ.1,700 కోట్లు
శనగ పంట క్యాష్ సబ్ వెన్షన్ కసం రూ.300 కోట్లు
సూక్ష్మ సేద్యానికి రూ.1,224 కోట్లు
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను రూపాయిన్నరకే సరఫరా చేయడానికి రూ.1,520 కోట్లు
గత ప్రభుత్వం బకాయిల చెల్లింపుల కోసం రూ.2,771
వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాల మాఫీ కోసం రూ.688 కోట్లు
విత్తన బకాయిలు రూ.384 కోట్లు
ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.960 కోట్లు
పంటల బీమా బకాయిల కోసం రూ. 716 కోట్లు
రైతుల పరిహారం కోసం రూ.23 కోట్లు












Click it and Unblock the Notifications