చంద్రబాబు, లోకేష్ కేసుల ఫైల్స్ మాయం..!!
రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కార్యాలయంలో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత అమరావతి పైన ఫోకస్ చేసింది. సీఆర్డీఏ ద్వారా తిరిగి అధికారికంగా కార్యకలాపాలు మొదలయ్యాయి. అమరావతి భవిష్యత్ ప్రణాళికలపైన ప్రబుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో సీఆర్డీఏ కార్యాలయంలో కీలక ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.
కీలక దస్త్రాలు మాయం
సీఆర్డీఏ కార్యాలయంలో కీలక దస్త్రాలు కనిపించటం లేదని తెలుస్తోంది. 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వం అమరావతికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి కేంద్రంగా అవినీతి జరిగిందనే ఆరోపణలతో పలు విషయాల్లో లోతుగా విచారణ చేసారు. ఆ సమయంలోనే టీడీపీ ముఖ్యుల పైన కేసులు నమోదు చేసేందుకు సీఆర్‌డీఏ ఫైల్స్‌ను అణువణువూ శోధించింది. విచారణ కోసం పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని కీలక ఫైళ్లు ఇప్పటికీ కనిపించడం లేదు.

అధికారుల ఫిర్యాదు
దీంతో సీఆర్‌డీఏ పాలనా వ్యవహారాలకు ఇబ్బందిగా మారింది. అమరావతి ప్రక్రియ తిరిగి ప్రారంభమైన క్రమంలో కీలక వ్యవహారాలపై ముందుకు వెళ్లేందుకు సీఆర్‌డీఏ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఫైళ్లు కనిపించని విషయం మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి కూడా వెళ్లింది. ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్ ఇలా పలు విభాగాల ఫైల్స్ కనిపించడం లేదు. ఈ ఫైళ్లను టీడీపీ ప్రభుత్వంపై విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం నాడు స్వాధీనం చేసుకున్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.
నిర్ణయాల్లో సమస్యలు
నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు సింగపూర్ దేశంతో చేసుకున్న ఎంఓయూలకు సంబంధించిన ఫైళ్లను కూడా వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వీటిలో కూడా కొన్ని కనిపించటం లేదని తెలుస్తోంది. చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పైన ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో చేర్చారు. ఈ ఫైల్స్ కూడా కనిపించటం లేదని తెలుస్తోంది. నాడు విచారణ కోసం తీసుకెళ్లిన ఫైల్స్ చాలావరకు వెనక్కి రాలేదని తెలుస్తోంది. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు ఈ ఫైళ్లు ఇచ్చేశారు. ఫైళ్లు తెచ్చుకుందామంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications