తిరుపతి వెళ్లాలనుకుంటున్నవారికి ముఖ్య గమనిక

తిరుపతి స్వామివారి దర్శనానికి, ఇతర పనులు ఏమైనా ఉంటే చూసుకోవడానికి వెళ్లేవారికి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకొని ప్రయాణ ఏర్పాట్లు చూసుకోవాలని, లేదంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ పనులు జరుగుతుండటంతో తిరుపతి-కాట్పాడి మధ్య ఉన్న సెక్షన్ లో రైళ్లు రద్దయ్యాయి.

30వ తేదీ వరకు రద్దు
07659 తిరుపతి నుంచి కాట్పాడి వెళ్లే తిరుపతి రైలు జూన్ 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రద్దైంది. ఈ రైలు ఉదయం 6.50 గంటలకు బయలుదేరుతుంది.ఉండదు. సాధారణంగా ఈ ట్రైన్ ఉయదం 6.50 నుంచి ఉంటుంది. అలాగే 07582 కాట్పాడి-తిరుపతి రైలు కూడా రద్దైంది. ఇది ప్రతిరోజు కాట్పాడిలో రాత్రి 9.15 గంటలకు బయలుదేరుతుంది. దీన్ని కూడా 30వ తేదీ వరకు రద్దుచేశారు.

Important note for who want to go to Tirupati

సిగ్నలింగ్ వల్లే ప్రమాదం?
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ పనులతోపాటు సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరించే పనులు కూడా భారతీయ రైల్వే ప్రారంభించింది. కొన్నాళ్ల క్రితం ఒడిసాలోని బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 300కు పైగా ప్రయాణికులు మరణించారు. దేశవ్యాప్తంగా ఈ తరహా దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. ఒకరకంగా ఈ ప్రమాదం జరగడానికి సిగ్నలింగ్ వ్యవస్థదే ప్రధాన లోపమని రైల్వే ఒప్పుకున్నట్లు అయింది. అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం రెండు పర్యాయాలు రైల్వేకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. అలాగే మూడో పర్యాయం కూడా అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోడీ ఈసారి కూడా రైల్వేకు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. ఇటీవలే వెల్లడైన ఫలితాల్లో ఎన్డీయే కూటమి 292 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+