TTD ఈవో ధర్మారెడ్డికి జైలుశిక్ష
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. ముగ్గురు ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు అమలు చేయలేదు. దీనిపై సదరు ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవో ధర్మారెడ్డికి నెల రోజులు జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తాజాగా ఒక నోటీసు విడుదల చేశారు. ఆన్ లైన్ లో ఎక్కడా లడ్డూ ప్రసాదం అమ్మకాలు ఉండవని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆన్ లైన్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకునే సదుపాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకువచ్చారంటూ వచ్చిన వార్తలను తితిదే ఖండించింది. అటువంటిదేమీ లేదని, దర్శనం బుక్ అయిన తర్వాతే అదనపు లడ్డూల కోసం పరిమితంగా బుక్ చేసుకునే సదుపాయం ఉందని, తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ స్పష్టం చేసింది.

నూతన సంవత్సరంలో స్వామివారిని దర్శించాలనుకునేవారికి, శ్రీవారి సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు టికెట్లు సిద్ధం చేస్తున్నారు. జనవరి నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను 12వ తేదీన విడుదల చేసింది. తిరుమలలో జనవరి రెండో తేదీ నుంచి 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. గతంలో అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తూ గతేడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువమంది భక్తులకు దర్శన అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications